YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

పోలింగ్ రోజు 17న సెక్టోరల్ అధికారులే కీలకం... ఆర్డీఓ

పోలింగ్ రోజు 17న సెక్టోరల్ అధికారులే కీలకం... ఆర్డీఓ

తిరుపతి, ఏప్రిల్ 2  
 తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక పోలింగ్ 17న సెక్టోరల్ అధికారులకు 16,17,18 మూడు రోజులు కీలకం గత అనుభవం వున్నా  శిక్షణ అనేది తప్పనిసరి అని తిరుపతి ఆర్డీఓ కనక నరసా రెడ్డి సూచించారు.
శుక్రవారం ఉదయం తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణపై  స్థానిక ఎస్.వి.యూనివర్సిటీ సెనేట్ హాల్ లో జిల్లాలోని సెక్టోరల్ అధికారులకు, తహశీల్దార్లకు, ఎం.పి.డి.ఓ లకు ఎన్నికల కమిషన్  స్వీప్  ప్రోగ్రాం పై ఒక్కరోజు  శిక్షణ కార్యక్రమం ఎ ఆర్ ఓ లు తిరుపతి చంద్రమౌళీశ్వర రెడ్డి, శ్రీకాళహస్తి శ్రీనివాసులు, స్సత్యవేడు చంద్రశేఖర్, ఆర్డీఓ కనకనరసా రెడ్డి, జి.ఎం.స్మార్ట్ సిటీ చంద్రమౌళి , డిపిఓ దశరదరామి రెడ్డి పి.పి.టి. ఏర్పాటు తో ఎన్నికల నిర్వహణ, ఇ విఎం, వివిపాట్ ల పై అవగాహన  కల్పించారు.
ఆర్డీఓ కనకనరసా రెడ్డి మాట్లాడుతూ  సెక్టోరల్ అధికారులు నేటి నుండి అప్రమత్తంగా ఉండాలి, 16న ఈవిఎం డిస్ట్రిబ్యూషన్, 17న పోలింగ్ అనంతరం రిసిప్షన్ సెంటరకు చేర్చి, 18న స్ట్రాంగ్ రూమ్ నందు అబజర్వర్ స్కృటిని వరకు అప్రమత్తంగా వుండాలి అన్నారు. ఒక ఉప ఎన్నిక మాత్రమే జరుగుతున్న సందర్భంగా మరింత జాగ్రత్తగా ఉండాలి, చెక్ లిస్ట్ మేరకు వ్యవహరించాలని అన్నారు. గత ఎన్నికల నుండి సెక్టోరల్ అధికారులు కీలకమని ఈ.సి.సూచించిన విషయం తెలుసు అన్నారు. పోలింగ్ సమయంలో అందరి దృష్టి మీపై వుంటుందని చిన్న పొరపాటు కు తావివ్వరాదని సూచించారు.
జి.ఎం.స్మార్ట్ సిటీ చంద్రమౌళి మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ ఈటీఎస్  సాఫ్ట్వేర్ ద్వారా బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్, వివి పాట్ సీరియల్ నెంబర్ మేరకు పోలింగ్ బూత్ కు అలాట్ ఉంటుంది, ఆ ప్రకారం జాగ్రత్తగా వాడాలి అన్నారు. ఇప్పటికే 30 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు, విత్ డ్రా తరువాత కూడా కనీసం 2 బ్యాలెట్ యూనిట్లు తప్పని సరి కానున్నాయని అన్నారు. ఈవిఎం ల కమిషనింగ్ పిపిటి ద్వారా వివరించారు. బ్యాలెట్ పేపర్  అనుసందానం, బి.యు., సి.యు., వివిపాట్ అనుసందానం, సీలింగ్  వంటి వాటిపై  పూర్తి అవగాహన కల్పించారు.
ఈ శిక్షణ కార్యక్రమంలో తహశీల్దార్లు జయరాములు, ఉదయ్ సంతోష్,దస్తగిరయ్య, ఎం.పి.డి.ఓ.లు, తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు అసెంబ్లీ పరిధి సెక్టోరల్ అధికారుల , ఎన్నికల డిటీలు , రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
 

Related Posts