YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

డిపాజిట్టైనా....దొరికేనా

డిపాజిట్టైనా....దొరికేనా

తిరపతి, ఏప్రిల్ 2, 
తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక భారతీయ జనతా పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారింది. ఒక రకంగా పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజుకు ఇది సవాల్ గానే చెప్పాలి. తిరుపతి ఉప ఎన్నికలో అధికార పార్టీని ఎదుర్కొని గెలవడం మాట అచుంచి, నిలవడం కూడా కష్టమే. ఈ సంగతి కొద్ది పాటి రాజకీయ అవగాహన ఉన్న వారికి ఎవరికైనా తెలుస్తుంది. సోము వీర్రాజు ఎంత చెమటోడ్చినా తిరుపతి ఉప ఎన్నికల్లో డిపాజిట్ కూడా దక్కడం కష్టమే.అసలు తిరుపతి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో బీజేపీకి బలమైన నేతలు ఎవరున్నారు? కనీసం మండల స్థాయిలో ప్రభావం చూపే నేతలు ఉన్నారా? మోదీ, అమిత్ షాలను చూసి ఈ ఎన్నికల్లో ఓట్లు వేస్తారా? అంటే లేదు అనే అన్ని ప్రశ్నలకు ఒక్కటే సమాధానం వస్తుంది. అయినా సోము వీర్రాజు పట్టుబట్టి తిరుపతి ఉప ఎన్నిక లో తామే పోటీ చేసేలా జనసేనపై వత్తిడి తెచ్చారు. ఒకరకంగా జనసేనకు ఈ ఎన్నికను వదిలేసి ఉంటే కొద్దో గొప్పో పరువు అయినా దక్కేది.పరిస్థితులను అధ్యయనం చేసుకున్న జనసేనాని తెలివిగా పోరు నుంచి తప్పుకున్నారు. ఇప్పుడు అక్కడ బీజేపీ గెలిచినా ఓడినా పవన్ కల్యాణ్ కు పోయేదేమీ లేదు. ఓడిపోతే తామే పోటీ చేసి ఉంటేనా? అన్న ప్రశ్న జనసేన నుంచి ఖచ్చితంగా వస్తుంది. ఈ నేపథ్యంలో సోము వీర్రాజు పదే పదే తిరుపతి నేతలతో సమావేశమవుతున్నారు. వారిలో ధైర్యం నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఏపీలో ఇతర ప్రాంతాల మాదిరి హిందుత్వ కార్డు పనిచేయదు.దీంతో సోము వీర్రాజు ఇక్కడ తిరుపతి అభ్యర్థి గెలిస్తే కేంద్ర మంత్రి దక్కుతుందని ప్రచారం చేస్తున్నారు. గత రెండేళ్లుగా ఏపీ నుంచి కేంద్రమంత్రివర్గంలో ఏపీకి స్థానం లేదు. ఆ మాటకు వస్తే మోదీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి మిత్రపక్షమైన టీడీపీకి తప్పించి ఏపీ నేతలెవ్వరికీ కేబినెట్ లో చోటు ఇవ్వలేదు. ఈ ప్రచారం కూడా సోము వీర్రాజుకు వర్క్ అవుట్ అయ్యేది కాదు. ఇప్పుడు సోము వీర్రాజుకు గెలవడం కన్నా టీడీపీ కంటే ఎక్కువ ఓట్లు సాధించాలన్న తపనే ఎక్కువగా కనపడుతుంది. అయితే సోము వీర్రాజు పక్కన పనికొచ్చే నేతలు ఎవరూ లేకపోవడంతో అది కూడా సాధ్యమయ్యే పరిస్థితి లేదు. సో.. సోము స్వేదం చిందించినా ఈ ఎన్నికల్లో డిపాజిట్ దక్కించుకుంటే అంతే చాలు.

Related Posts