YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం తెలంగాణ

సింగరేణిలో తారా స్థాయికి విబేధాలు

సింగరేణిలో తారా స్థాయికి విబేధాలు

అదిలాబాద్, ఏప్రిల్ 3, 
ఉత్తర తెలంగాణలో విస్తరించిన సింగరేణి గనుల్లో టీఆర్‌ఎస్‌ అనుబంధ సంఘమైన టిబీజీకేఎస్ లో నేతల మద్య వివాదం తారాస్థాయికి చేరుకుంది. అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కేవలం తమ అనుచరులకే పదవులు కట్టబెడుతున్నారని ఇతరులు గుర్రుగా ఉన్నారట. కొంత కాలంగా ఇదే అంశంపై తీవ్రస్థాయిలో చర్చ జరుగుతున్నట్టు తెలుస్తుంది. శ్రీరాంపూర్‌లో టీబీజీకేఎస్ అధ్యక్షుడు వెంకట్రావ్‌ను నిలదీయడం కలకలం రేపింది. సెంట్రల్ కమిటీలో తమను సంప్రదించకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం ఏంటని ప్రశ్నించడంతో ముసలం మొదలైంది.ఇటీవలే టీఆర్ఎస్ గుర్తింపు సంఘానికి సెంట్రల్ కమిటీని ఏర్పాటు చేశారు. అందులో గౌరవాధ్యక్షురాలిగా ఎమ్మెల్సీ కవిత, యూనియన్ అధ్యక్ష కార్యదర్శులుగా వెంకట్రావ్, మిర్యాల రాజిరెడ్డిలను ప్రకటించారు. వీరు కాకుండా మిగిలిన పోస్టుల్లో శ్రీరాంపూర్ ఏరియాకు చెందిన వారికి సెంట్రల్ కమిటిలో చోటు దక్కింది. దానికి సంబంధించిన నివేదికను ఆర్‌ఎల్‌సీ, అలాగే సింగరేణి యాజమాన్యానికి అందజేశారు. ఇక్కడే అగ్గి రాజుకుంది.వలస వచ్చిన వారికి పదవులెలా కట్టబెడతారని యూనియన్‌లోని సీనియర్లు మండిపడ్డారట. సమాధానం చెప్పేవరకు కదలొద్దని వెంకట్రావ్‌ను చుట్టుముట్టడంతో గౌరవాధ్యకురాలికి చెప్పి సమస్యను పరిష్కరించుకుందామని చెప్పి ఆయన జారుకున్నారట. యూనియన్‌ నేతల వాదన మాత్రం మరోలా ఉంది. కేవలం ఒకరిద్దరి ఒంటెద్దు పోకడల వల్ల టీబీజీకేఎస్ కు చెడ్డ పేరు వస్తోందని ఆరోపిస్తున్నారు. రీజియనన్ల వారిగా అధ్యక్ష కార్యదర్శులు పదవుల పంపకాలు చేస్తున్నారని.. బ్రాంచి లేదా ఏరియా స్థాయిలో చర్చలే లేవని మండిపడుతున్నారు నాయకులు.యూనియన్ కోసం పనిచేసే వారిని కాకుండా పైరవీలు చేసేవారికి పదవులు ఇస్తున్నారని ఫైర్‌ అవుతున్నారు. మరి.. యూనియన్‌ పెద్దలు ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తారో అన్న చర్చ కార్మికుల్లో ఉంది. ఇతర సంఘాలు సైతం టీఆర్ఎస్ గుర్తింపు సంఘంలో పరిణామాలను గమనిస్తున్నాయి.

Related Posts