YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం విదేశీయం

మళ్లీ మొదటికొచ్చిన నేపాల్ ఇష్యూ

మళ్లీ మొదటికొచ్చిన నేపాల్ ఇష్యూ

ఖాట్మాండు,  ఏప్రిల్ 3, 
నేపాల్ లో గత మూడు నెలలుగా కొనసాగుతున్న రాజకీయ ప్రతిష్ఠంభన కొత్త మలుపు తిరిగింది. పార్లమెంటును రద్దు చేస్తూ ప్రధాని ఖడ్గ ప్రసాద్ శర్మ ఓలీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చెల్లదన్న సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఒక్కసారిగా పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఈ తీర్పు ఓలీ సర్కారుకు గట్టి ఎదురుదెబ్బే. అదే సమయంలో అధికార పార్టీలోని ఓలీ వ్యతిరేక వర్గానికిచెందిన ప్రచండ కు ఊపిరిపోసింది.. చేతనైతే తనను గద్దె దించాలంటూ తన సొంత ప్రాంతమైన జాఫా పట్టణంలో ఫిబ్రవరి 28వ తేదీ సాయంత్రం బహిరంగ సవాల్ విసరడం ద్వారా ఓలీ పరోక్షంగా రాజీనామా ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. ఇక ఆయన వ్యతిరేక వర్గానికి నాయకత్వం వహిస్తున్న పార్టీలోని మాజీ పుష్ప కమల్ దహాల్ అలియాస్ ప్రచండ ఎలాంటి వ్యూహాన్ని అనుసరిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.2018లో ఓలీ నాయకత్వంలోని కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ నేపాల్, ప్రచండ సారథ్యంలోని కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ నేపాల్ (యూనిఫైడ్ మార్క్సిస్టు లెనినిస్టు- యూఎంఎల్) విలీనమయ్యాయి. ప్రధాని పదవిని చెరి సగం కాలం పంచుకోవాలని అప్పట్లో ప్రతిపాదించారు. ఇందులో భాగంగా ఓలీ ముందుగా ప్రధాని పదవి చేపట్టారు. ప్రచండకు పార్టీ అధ్యక్ష పదవి లభించింది. కానీ ఒప్పందం మేరకు ప్రధాని పదవి నుంచి తప్పుకోవడానికి ఓలీ నిరాకరించడంతో గత కొంత కాలంగా పార్టీలో తీవ్రమై విభేదాలు నెలకొన్నాయి. ప్రచండ వర్గం ఓలీని పార్టీ నుంచి బహిష్కరించింది. దీంతో గత ఏడాది డిసెంబరు 20న ఓలీ ఏకంగా పార్లమెంటును రద్దు చేశారు. ఈ సిఫారసును ఆమోదించిన అధ్యక్షురాలు బిద్యాదేవి భండారీ ఏప్రిల్ 30, మే 10తేదీల్లో ఎన్నికల నిర్వహణకు ఆదేశించారు.
ఈ నేసథ్యంలో పార్లమెంటు రద్దుపై సుప్రీంకోర్టులో అనేక వ్యాజ్యాలు దాఖలయ్యాయి. వీటిపై లోతుగా విచారించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చోలేంద్ర షుమ్ షుర్ నాయకత్వంలోని అయిదుగరు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం పార్లమెంటు రద్దు నిర్ణయం చెల్లదంటూ గత నెలాఖరులో తీర్పిచ్చింది. ఇది పూర్తిగా రాజ్యంంగ వ్యతిరేకమని 13 రోజుల్లో పార్లమెంటును పునరుద్ధరించాలంటూ విస్పష్టంగా ఆదేశించింది. ఈ తీర్పు ఓలీ వర్గానికి శరాఘాతంగా పరిణమించగా, ప్రచండ వర్గానికి ఎంతో ఊరట కలిగించింది. 275 మంది సభ్యులు గల పార్లమెంటులో అధికార పార్టీకి 173 మంది సభ్యుల మద్దతు ఉంది. ఇందులో ఓలీ వర్గానికి 83 మంది, ప్రచండ వర్గానికి 90 మంది సభ్యుల మద్దతు ఉంది.దేశ రాజకీయాల్లో సుదీర్ఘ చరిత్ర గల నేపాలీ కాంగ్రెస్ వామపక్ష భావజాలానికి వ్యతిరేకం. ఉదార విధానాలు అనుసరిస్తుంది. ఇప్పుడు వామపక్ష భావజాలం గల పార్టీ ఇలా రాజకీయ ఒడిదుడుకులను ఎదుర్కొనడం విశేషం.

Related Posts