YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఏపీలో ఏం జరుగుతోంది..

ఏపీలో ఏం జరుగుతోంది..

విజయవాడ, ఏప్రిల్ 3, 
ఏపీ రాజకీయాలో అత్యంత వివాదాస్పదమైన ఎన్నిక కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ మొన్న పదవీ విరమణ చేయగా మాజీప్రధాన కార్యదర్శి నీం సాహ్ని నిన్న బాధ్యతలు స్వీకరించారు. వెంటనే రంగంలోకి దిగి సిఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌ తదితరుతో చర్చులు జరిపిన  ఆమె ఏప్రిల్‌ 8న జెడ్‌పిటిసి ఎంపిటిసి ఎన్నికలు జరుగుతాయని నోటిఫికేషన్‌ జారీ చేశారు. అవసరమైతే తొమ్మిదిన రీపోలింగ్‌, 10న ఫలితాల ప్రకటన, తర్వాత పరిషత్‌ ఎన్నికలు వుంటాయి. కాకుంటే గతంలో హైకోర్టులో దీనిపై ఒక కేసు విచారణ జరిగి తీర్పు రిజర్వ్ లో వున్నందున దానికోసం చూడవలసి వుంటుందని మొదట భావించారు. అయితే ఆ కేసు కూడా ఎన్నికలు జరపాలని కోరుతూ వేసిందే. అప్పటి ఎస్‌ఇసి నిమ్మగడ్డ అందుకు విముఖత తెలిపారు. బహుశా ఇప్పుడు అనుకూలంగానే తీర్పు రావచ్చని ఎస్‌ఇసికి సూచనలు వచ్చి వుండొచ్చు. ఏమైనా పదో తేదీ వరకు ఈ ఎన్నికల సందడి ఆవరించనుంది. ఏప్రిల్‌ 17న జరగాల్సిన తిరుపతి  ఉప ఎన్నికలపై పార్టీలు కేంద్రీకరించకుండా అడ్డుకోవడానికే ఈ ఎన్నికలు జరుపుతున్నారని బిజెపి ఆరోపిస్తున్నా దానికి అక్కడ అంత పెద్ద అవకాశమేమీలేదని అందరికీ తెలుసు. ఇక   తెలుగుదేశం నీలం సాహ్ని నిష్పాక్షికత మీద సందేహాలు వెలిబుచ్చుతూ ఎన్నికను బహిష్కరించ నున్నట్టు ప్రకటించింది. దీనిపై ఆ పార్టీ వారిలో అంతర్గతంగానే అసంతృప్తి భగ్గుమంటున్నది. అయితే  నామినేషన్లు వేశాక బహిష్కరణ సాంకేతికంగా సాధ్యమయ్యేది కాదు గనక క్షేత్రస్థాయిలో పాల్గొంటారనే అభిప్రాయం కూడా బాగానే ఉంది. రాజకీయ సందేహాలు ఏమున్నప్పటికీ  కొత్త ఎస్‌ఇసి ఇంకా పని ప్రారంభించకముందే ఈ విధంగా అంటే మాత్రం ఆదిలోనే హంసపాదు లా ఉంటుంది, నేడు ఆమె రాజకీయ పార్టీలతో సమావేశాన్ని టిడిపి, బిజెపి, జనసేన బహిష్కరించడం కూడా ఇందులో భాగమే. కోర్టు ముందు ఈ ఎన్నికలపై పాత కేసు కొన్ని ఉండగా కొత్తగా కూడా దాఖలు అవుతున్నాయి.  నిమ్మగడ్డ హయాంలోనే ఈ ఎన్నికలు కూడా జరపాలని ప్రభుత్వం కోరినా ఆయన అంగీకరించలేదు, కొత్త ఎస్‌ఇసి వచ్చాక జరుపుకోవడం మాకు పెద్ద పని కాదని కూడా అప్పట్లో మంత్రులు అన్నారుమరోవైపున నిమ్మగడ్డ పదవినుంచి దిగిపోయినా గత వివాదాలు వదలడం లేదు. గవర్నర్‌కు తన సెలవు గురించి రాసిన లేఖ లీక్‌ కావడంపై సిబిఐ విచారణ జరిపించాలని  ఆయన ప్రధాన కార్యదర్శిమీద కేసువేయడాన్నిరాజ్‌భవన్‌ తప్పు పట్టింది, ఈమేరకు ప్రధాన కార్యదర్శి అఫిడవిట్‌ దాఖలు చేశారు. అసలు నిమ్మగడ్డ లేఖ రహస్యం కాన్ఫిడెన్షియల్‌ ఆని రాయలేదని, వాటిని తనే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తదితరులకు కూడా పంపించారని పేర్కొన్నారు.  నేరమే జరగనపుడు విచారణ దేనిపై జరిపిస్తారని ఎదురు ప్రశ్న వేశారు.  నిమ్మగడ్డకు సభా హక్కుల సంఘం ఇచ్చిన నోటీసు కూడా వుంది. పదవీ విరమణ చేసినా దాన్ని వదలిపెట్టబోమని గతంలో ఆ కమిటీ ప్రతినిధులు చెప్పి ఉన్నారు. ఇదే గాక తన ఓటును హైదరాబాద్ నుంచి గుంటూరు జిల్లా దుగ్గిరాలకు బదిలీ చేయించుకునే విషయంలో పౌరుడుగా పోరాడతానని నిమ్మగడ్డ ప్రకటించారు. కాబట్టి ఈ ప్రహసనం ఇంకా కొనసాగుతూనే ఉంటుంది.

Related Posts