కడప ఏప్రిల్ 3,
కడప జిల్లా ఒంటిమిట్ట కోదండరాముని శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్స వాల ఏర్పాట్లపై కలెక్టర్ హరి కిరణ్, జిల్లా అధికారులు పరిశీలించారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లుతో సంసిద్ధంగా ఉండాలని ఆదేశించారు.ఒంటిమిట్ట కోదండరా ముని శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్స వాలు ఏప్రిల్ 21 నుంచి 29వ తేదీ వరకు జరగనున్నాయి. ఉత్సవాలను వైభవంగా నిర్వహించడానికి కడప జిల్లా అధికారులు సమాయత్తం కావాలని ఆదేశించారు. రాష్ట్ర పండుగ గా నిర్వహించే.. శ్రీరామనవమి వేడుకలకు విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టాలని అధికారులకు సూచించా రు.జిల్లా అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులతో సమన్వయంతో ముందుకెళ్లాలన్నారు.ఏప్రిల్ 26న శ్రీ సీతారాముల కల్యాణోత్సవానికి దాదాపు రెండు లక్షల మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉందని అంచనా వేశారు. కల్యాణోత్సవానికి ముఖ్యమంత్రి అతిథిగా వస్తున్నారని, పోలీస్ అధికారులు సమన్వయంతో భద్రతాపరమైన ఏర్పాట్లు చేయడానికి సహకరించాలని కోరారు.