కాకినాడ
కాకినాడ నుండి విజయవాడ వెళ్తున్న ఏసి ఆర్టీసీ బస్సు శనివారం ఉదయం 7.30 గంటలకు జిల్లా పరిషత్ సెంటర్ కు చేరుకునే సరికి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అదృష్టవశాత్తూ డ్రైవర్ అప్రమత్తం కావడం తో ప్రయాణికులు సురక్షితంగా బయట పడ్డారు. ప్రమదం జరిగిన సమయంలో బస్సులో సుమారు 15 మంది ప్రయాణికులు ఉన్నారు. షార్ట్ సర్క్యూట్ కారణం గా మంటలు చెలరేగినట్లు గుర్తించారు. ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేసారు.