YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

మే మొదటివారం కేంద్రమంత్రి గడ్కరి రాక

మే మొదటివారం కేంద్రమంత్రి గడ్కరి రాక

మే 5న కేంద్రమంత్రి నితిన్ గడ్కరి హైదరాబాద్ రానున్నారు. రూ.1523 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా  హైదరాబాద్ ఔటర్ రింగ్రోడ్డు-మెదక్, ఆరంఘర్-శంషాబాద్ 6 లైన్ల రోడ్డు, అంబర్పేట్లో 4 లేన్ల ఫ్లైఓవర్తో పాటు ఉప్పల్లో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనులను నితిన్ గడ్కరి ప్రారంభించనున్నారు.

తెలంగాణ ఏర్పడకముందు రాష్ట్రంలో జాతీయ రహదారుల నిడివి 2647 కిలోమీటర్లు ఉండగా.. ఈ  నాలుగేళ్ల మోదీ పాలనలో రాష్ట్రానికి మరో 2656 కిలోమీటర్లు జాతీయ రహదారులు మంజూరయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా జాతీయ రహదారుల్లో ఇవాళ  తెలంగాణ 2వ స్థానంలో ఉంది. కేంద్రం ఉదారంగా హైదరాబాద్ చుట్టూ 4 వరుసల రీజినల్ రింగ్ రోడ్డు మంజూరు చేసి, ఇందుకు 4 వేల కోట్ల రూపాయలను కేటాయించింది. అంతేకాదు తెలంగాణలో గ్రామీణ సడక్ యోజన కింద 205 కోట్లతో  కేంద్రం రహదారులను అభివృద్ధి చేస్తుంది. ఈ పథకంలో భాగంగా ఇప్పటికే తొలిదశలో రహదారులు, వంతెనల నిర్మాణం చేపట్టారు. హైదరాబాద్-అమరావతి ఎక్స్ప్రెస్ హైవే, హైదరాబాద్-బెంగళూరు ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణానికీ మోదీ ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేసింది.

Related Posts