YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

కోవిడ్ టీకా తీసుకున్న త‌ర్వాత శృంగారంలో పాల్గొన‌వ‌చ్చా!?

కోవిడ్ టీకా తీసుకున్న త‌ర్వాత శృంగారంలో పాల్గొన‌వ‌చ్చా!?

హైద‌రాబాద్ ఏప్రిల్ 3
కోవిడ్ టీకా తీసుకున్న త‌ర్వాత శృంగారంలో పాల్గొన‌వ‌చ్చా లేదా అన్న అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. టీకా వ‌ల్ల దీర్ఘ‌కాలిక లేదా స్వ‌ల్ప కాలిక స‌మ‌స్య‌లు ఏమైనా ఉత్ప‌న్నం అవుతాయా అని కూడా కొంద‌రిలో డౌట్స్ వ‌స్తున్నాయి. నిజానికి కేంద్ర ఆరోగ్య‌శాఖ మాత్రం దీనిపై ఎటువంటి వివ‌ర‌ణ ఇవ్వ‌లేదు. టీకా తీసుకున్న వారు సెక్స్‌లో పాల్గొన‌డం సుర‌క్షిత‌మా లేదా అన్న అంశాన్ని ఆ ‌శాఖ స్ప‌ష్టం చేయ‌లేదు. కానీ కొంద‌రు నిపుణులు ఈ అంశంపై స్పందించారు. స్త్రీ, పురుషులిద్ద‌రూ కోవిడ్ టీకా రెండ‌వ డోసు తీసుకున్న త‌ర్వాత కొన్ని వారాల పాటు కండోమ్‌ల‌ను వాడాల‌ని సూచిస్తున్నారు. ఘ‌జియాబాద్‌కు చెందిన డాక్ట‌ర్ దీప‌క్ వ‌ర్మ దీనిపై కొంత వివ‌ర‌ణ ఇచ్చారు. సార్స్ సీవోవీ2 వైర‌స్ అనేది కొత్తది అని, ఆ వైర‌స్‌ను నిర్వీర్యం చేసేందుకే టీకాల‌ను అభివృద్ధి చేశార‌ని, ఆ టీకాలు వాడ‌డం వ‌ల్ల ఏవైనా దీర్ఘ‌కాలిక వ్యాధుల వ‌స్తాయా లేదా అనేది ఇప్పుడే చెప్ప‌లేమ‌ని ఆయ‌న అన్నారు. శృంగారంలో పాల్గొన‌డం ద్వారా ఎటువంటి ప‌రిస్థితులు ఉత్ప‌న్నం అవుతాయో చెప్ప‌లేమ‌ని, కానీ రెండ‌వ డోసు తీసుకున్న మూడు వారాల వ‌ర‌కు కండోమ్‌ల‌ను వాడ‌డం సుర‌క్షిత‌మ‌ని డాక్ట‌ర్ వ‌ర్మ తెలిపారు. ఎందుకంటే శృంగార స‌మ‌యంలో శ‌రీర ద్ర‌వాలు కాంటాక్ట్‌లోకి వ‌స్తాయ‌ని, అందుకే ముందు జాగ్ర‌త్త‌గా కండోమ్‌లు వాడ‌డం ఉత్త‌మం అని తెలిపారు. మ‌హిళ‌లు గైన‌కాల‌జీ డాక్ట‌ర్ల‌ను సంప్ర‌దించ‌డం బెస్ట్ అన్న అభిప్రాయాన్ని ఆయ‌న వ్య‌క్తం చేశారు.

Related Posts