YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

అభివృద్ధికి ఆమ‌డ దూరంలో కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాలు... ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్

అభివృద్ధికి ఆమ‌డ దూరంలో కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాలు...  ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్

రాజన్న సిరిసిల్ల ఏప్రిల్ 3
కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాలు అభివృద్ధికి ఆమ‌డ దూరంలో ఉన్నాయి. కానీ తెలంగాణ‌లో మాత్రం అభివృద్ధి, సంక్షేమం జోడెద్దుల‌గా ముందుకెళ్తున్నాయ‌ని ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ స్ప‌ష్టం చేశారు.75 ఏండ్ల స్వాతంత్ర్యంలో ఏ పార్టీ చేయ‌ని అభివృద్దిని టీఆర్ఎస్ ప్ర‌భుత్వం చేసి చూపించింద‌న్నారు. వేస‌వి కాలంలోనూ ప్ర‌తి ఇంటికి సుర‌క్షిత‌మైన మంచినీరు ఇచ్చిన ఘ‌న‌త టీఆర్ఎస్ ప్ర‌భుత్వానికే ద‌క్కుతుంద‌న్నారు. కేంద్రం అవార్డులు మాత్ర‌మే ఇస్తుంది కానీ నిధులు ఇవ్వ‌డం లేద‌ని కేటీఆర్ ధ్వ‌జ‌మెత్తారు.
‌తెలంగాణ రాష్ర్ట అభివృద్ధి టీఆర్ఎస్ పార్టీతోనే సాధ్య‌మైంద‌ని ముస్తాబాద్ మండ‌లం మోహినికుంట‌లో నూత‌నంగా నిర్మించిన 65 డ‌బుల్ బెడ్రూం ఇండ్ల‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా అక్క‌డ ఏర్పాటు చేసిన స‌భ‌లో కేటీఆర్ ప్ర‌సంగించారు. మోహినికుంట‌లో డ‌బుల్ బెడ్రూం ఇండ్లు ప్రారంభించుకోవ‌డం ఎంతో ఆనందంగా ఉంద‌న్నారు. మ‌రో 6,825 ఇండ్లు జిల్లాలో క‌ట్టుకోబోతున్నామ‌ని తెలిపారు.గ‌తంలో ఇందిర‌మ్మ ఇండ్ల కోసం కాంగ్రెస్ నాయ‌కులు ప్ర‌జ‌ల‌కు మూడు చెరువుల నీళ్లు తాగించారు. ఒక్క ఇందిర‌మ్మ ఇల్లు కోసం రూ. 75 వేలు వారు ఖ‌ర్చు చేస్తే.. టీఆర్ఎస్ ప్ర‌భుత్వం మాత్రం పేద‌లు ఆత్మ‌గౌర‌వంతో బ‌త‌కాల‌నే ఉద్దేశంతో రూ. 5 ల‌క్ష‌ల‌తో డ‌బుల్ బెడ్రూం ఇండ్ల‌ను క‌ట్టించి ఇస్తున్నామ‌ని స్ప‌ష్టం చేశారు. మోహినికుంట గ్రామానికి ఉత్త‌మ పంచాయ‌తీ అవార్డు రావ‌డం చాలా సంతోషంగా ఉంద‌న్నారు.

Related Posts