హైదరాబాద్, ఏప్రిల్ 3,
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాల కోసం 2021-22 సంవత్సరానికి ఐసెట్ నోటిఫికేషన్- 2021 నోటిఫికేషన్ విడుదలైంది. ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాల షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఏప్రిల్ 7 నుంచి జూన్ 15 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఆగస్టు 13 నుంచి ఐసెట్ హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం కల్పించారు. ఇక ఆగస్టు 19, 20 తేదీల్లో తెలంగాణలో ఐసెట్ పరీక్షలు జరగనున్నాయి. సెప్టెంబర్ 17న ఐసెట్ ఫలితాలు విడుదల కానున్నాయి.
అలాగే ఆలస్య రుసుము రూ.250తో జూన్ 30 వరకు, రూ.500 ఆలస్య రుసుముతో జూలై 15 వరకు రూ.1000 ఆలస్య రుసుముతో జూలై 30 వరకు ఐసెట్‌కు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించినట్లు తెలుస్తోంది. ఇక పరీక్ష ఫీజు రూ.650 గా నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.450గా నిర్ణయించారు. అభ్యర్థులు పూర్తి వివరాలకు అధికారిక వెబ్ సైట్ https://icet.tsche.ac.in/ చూడొచ్చు.