YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

వంశపారపర్యం అర్చకులు....అసలేం జరిగిందంటే

వంశపారపర్యం అర్చకులు....అసలేం జరిగిందంటే

తిరుమల,ఏప్రిల్ 3, 
టిటిడి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. రిటైర్డ్ అర్చకుల విషయంలో తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకున్న సంచలన నిర్ణయం తో ప్రధానార్చకుడు హోదాలో మళ్లీ రమణ దీక్షితులు విధులలో చేరనున్నారు. ఆయన ఎంట్రీ పక్కా అయింది. రమణ దీక్షితులు తో పాటుగా ఆలయంలో మరికొంత మంది అర్చకులు కొలువు తీరనున్నారు. అయితే తిరుపతి ఉప ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ఈ విదంగా హడావుడిగా నియామకం చేయడం ఏంటనే విమర్శలు వస్తున్నాయి. స్వామి సేవలో తరించే అర్చకులు ఇంతలా రోడ్డున పడటానికి కారణాలేంటి. ఎందుకు ఏ ఆలయం లో లేని విదంగా ఒక్క శ్రీ వారి ఆలయం లోనే తరచూ అర్చక వివాదాలు వస్తుంటాయి. అధికారుల తప్పా... లేక ప్రభుత్వాల పెద్దల తప్పులా.... టీటీడీలో అర్చక వివాదం ఇప్పడే కొత్తగా వచ్చిందేం కాదు. గతంలో కూడా అర్చకత్వానికి వయో పరిమితిపై పలుమార్లు టీటీడీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ అర్చుకులు కోర్టుల గుమ్మం ఎక్కారు. 1933 వరకు మహంతుల పాలనలో కొనసాగిన శ్రీవారి ఆలయ వ్యవహారాలకు చెక్ పెడుతూ..., టీటీడీని నియమించింది అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం. పాలన మాత్రమే టీటీడీ కొనసాగించినా.. సంవత్సరాల తరబడి రామానుజ చార్యులు నిర్ధేశించిన విధంగా మిరాశీ వ్యవస్ధకు చెందిన అర్చకులు స్వామి వారికి పూజ కైంకర్యాలు నిర్వహిస్తూ వస్తున్నారు. శ్రీవారి ఆలయంలో మిరాశీ వ్యవస్థనే రద్దు చేస్తూ 1987లోని అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. దీంతో మిరాశీ వంశానికి చెందిన గొల్లపల్లి, పెద్దింటి, పైడిపల్లి, తిరుపతమ్మ కుటుంబాలు దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. సుదీర్ఘ వాదోపవాదాలు విన్న అత్యున్నత న్యాయస్థానం 1997 తీర్పును వెల్లడించింది. మిరాశీ వ్యవస్థను రద్దు చేస్తూ... మిరాశీ వంశీకులను అర్చకులుగా నియమించాలని టీటీడీని ఆదేశించింది.
వాయిస్:- ఆ తరువాత 2007లో మిరాశీ వంశీకులు అర్చక వారసత్వం ఒక కుటుంబం నుంచి ఒకరు పొందేలా అప్పటి ఏపీ గవర్నమెంటు జీఓను విడుదల చేసింది. మిరాశీ వంశీకులకు మళ్ళీ అర్చకత్వం పొందేలా అవకాశంకు తెరపడింది. 2013లో వయో పరిమితి అంశాన్ని మొట్టమొదటి సారి టీటీడీ అమలు చేసింది. టీటీడీ అనుబంధ అలయాలైన తిరుచానూరు, గోవింద రాజా స్వామి ఆలయాలలోని మిరాశీ అర్చకులను పదవీ విరమణ చేయించింది టీటీడీ. మొత్తం ముగ్గురు అర్చకులు అప్పుడు పదవి విరమణ పొందారు. మిరాశీ వంశీకులు మళ్ళీ హైకోర్టును ఆశ్రయించారు. అర్చకులకు 65 సంవత్సరాల వయో పరిమితి చెల్లదని.., వారి ఒంట్లో శక్తి ఉన్నంత వరకు సంభావం లేకుండా అర్చకులుగా కొనసాగించాలని కోర్టు టీటీడీకి ఆదేశాలు జారీ చేసింది. 2015వ సంవత్సరం అర్చకులకు రిటైర్మెంట్ అనే పదమే లేదని అప్పటి ఈఓ ఎం.జి గోపాల్ తెలిపారు.
 ఇంత వరకు ప్రశాంతంగా ఉన్నా.. 2018 మే నెల 15వ తారీఖున చెన్నైలో అప్పటి ఆలయ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు చేసిన ఆరోపణలు దేశ వ్యాప్తంగా సంచళనం కలిగించిన విషయం తెలిసిందే. అదే కాకుండా 65 సంవత్సరాలు పైబడిన అర్చకులు ప్రమాదవశాత్తు ప్రధాన ఆలయంలో స్వామి వారి ఉత్సవ మూర్తులను నేలపై పడేలా చేసిన సంఘటనల దృష్ట్యా టీటీడీ మరో మారు వయో పరిమితి అంశాన్ని బోర్డులో ప్రవేశ పెట్టింది. ప్రవేశ పెట్టడం, ఆమోదం పొందడం అంత శరవేగంగా అయిపోయాయి. దీనితో గొల్లపల్లి వంశానికి చెందిన రమణ దీక్షితులతో పాటు మరో మూడు కుటుంబాలకు సంబంధించిన ప్రధాన అర్చకులకు టీటీడీ రిటైర్మెంట్ ప్రకటించింది. వారితో పాటుగా తిరుచానూరు, గోవిందరాజ స్వామి ఆలయానికి చెందిన మరికొంత మంది అర్చకులు కూడా పదవి విరమణ పొందాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఖాళీ అయిన పోస్టులను అదే కుటుంబంకు చెందిన వారిని నియమించింది.
 రమణ దీక్షితులు సుప్రీమ్ కోర్టును ఆశ్రయించగా... తిరుచానూరు, గోవింద రాజా స్వామి మిరాశీ అర్చకులు హైకోర్టుని ఆశ్రయించారు. అత్యున్నత న్యాయస్థానంలో విచారణలో ఉండగా... హైకోర్టు మిరాశీ అర్చకులపై స్పష్టమైన తీర్పును గత సంవత్సరం డిసెంబర్ 14 తేదీన ప్రకటించింది. మిరాశీ అర్చకులు ఉద్యోగులు కాదని, వారికి టీటీడీ సర్వీసులు వర్తించవని తేల్చి చెప్పింది ఏపీ ధర్మాసనం. వారిని అర్చకత్వానికి అనుమతించాలని ఆదేశించింది. అయితే ఈ తీర్పు మాత్రం తిరుచానూరు రిటైర్మెంట్ అయిన అర్చకులకు మాత్రమే వర్తిస్ధాయి. అయితే ఈ విషయంలోనూ టీటీడీ కోర్టులో అప్పీల్ కు వెళ్ళింది. రిటైర్ అయిన వారిని మరలా విధుల్లోకి తీసుకుంటే వేద విజ్ఞాన ప్రవేశిక సర్టిఫికెట్స్ ఉన్న మిరాశీ కుటుంబంకు చెందిన 12 మందిని అర్చకులుగా టిటిడి నియమించింది.. మరల పదవి విరమణ చేసిన వారిని ఆలయ విధుల్లోకి తీసుకుంటే వీరి భవిష్యత్ ఎలా అనే అంశం పై టీటీడీ సందిగ్ధంలో పడింది.
వాయిస్:- మిరాశీ అర్చకుల పదవి విరమణ అనే అంశాన్ని రాజకీయం చేస్తూ అప్పటి అధికార పార్టిపై తీవ్ర విమర్శలు చేస్తూ రమణదీక్షితులు పావులు కదిపారు. రిటైర్మెంట్ అంశం తెరపైకి రాగానే అప్పటి అధికారంలో ఉన్న టిడిపీ ప్రభుత్వంపై, టిటిడి అధికారులపై తీవ్ర విమర్శలు చేశారు. దీంతో రమణ దీక్షితులపై ప్రభుత్వం సీరియస్ అయింది. దీంతో అప్పుడు ప్రతిపక్షంలో ప్రస్తుతం సీయంగా ఉన్న జగన్మోహన్ రెడ్డిని కలిసి తమ వంశపార్యంపర్య వృత్తిని అర్చకత్వాని కొనసాగించేలా చేయాలని కోరారు. అందుకు సానుకూలంగా స్పదించిన జగన్మోహన్ రెడ్డి పార్టీ అధికారంలోకి రాగానే అర్చకుల సమస్యలను తీరుస్తానని హామీ ఇచ్చారు. బహిరంగ సభలోను ప్రకటించడ. ఎన్నికల ఫలితాల ముందు కూడా జగన్ ను రమణ దీక్షితులు కలిశారు. సీఎం జగన్ తిరుమల పర్యటనకు వచ్చిన ప్రతిసారి రమణదీక్షితులు కలిసి తనకు న్యాయం చేయాలనీ కోరారు. అయితే రమణ దీక్షితులకు ఆగమ సలహాదారునిగా నియమించిన టీటీడీ ఆలయ గౌరవ ప్రధాన అర్చకునిగా హోదా కల్పిస్తూ 2019 నవంబర్ 6వ తేదీన ఉత్తర్వులిచ్చింది. నియమితులైన కొన్ని రోజులకే తనకు కచ్చితంగా ఆలయ ప్రధాన అర్చక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వచ్చాడు రమణ దీక్షితులు.
ఇప్పుడు ప్రధాన అర్చకులుగా కొనసాగుతున్న వేణుగోపాల దీక్షితులు, కృష్ణ దీక్షితులు మరికొందరు ఆలయ అర్చకులు మార్చి మాసంలో సీఎం జగన్ ను మర్యాదపూర్వకంగా కలసి తమ సమస్యలను విన్నవించుకున్నారు. ఖాళీల భర్తీ కోసం అభ్యర్థించిన మిరాశీ అర్చకులు తమ మిరాశీ వంశానికి చెందిన వారికే అర్చకత్వం ఇవ్వాలని కోరగా.., పచ్చ జెండా ఊపుతూ.., టీటీడీ ఈవోకు ఆదేశాలు జారీ చేసారు సీఎం జగన్. దీన్ని గమనించిన మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు మరోసారి.., వైసీపీ నేతలతో చర్చలు కొసాగించారు. తనకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని కోరడం జరిగింది.
వాయిస్:- సీఎం ఆదేశాల తో వయోపరిమితి పేరుతో రిటైరైన అర్చకులను తిరిగి విధుల్లోకి తీసుకుంటూ ఉత్తర్వులు జారీ చేసింది టిటిడి. గతంలో రిటైర్డ్ అయ్యిన ప్రధాన అర్చకులతో పాటు అర్చకులు విధుల్లో చేరాలంటూ ఆదేశాలు జారీ చేసింది. 38118/2018 హైకోర్టు తీర్పు మేరకు కోర్టు ఆదేశాలను పాటిస్తూ నిర్ణయించింనట్లు టిటిడీ చెబుతుంది. టిటిడి ఆదేశాలతో తిరిగి ప్రధాన అర్చకుడి హోదాలో రమణ దీక్షితులు మరో‌మూడు కుటుంబ సభ్యులు ఆలయ ప్రవేశం చేయడం ఖాయం. అయితే ప్రస్తుతం ఆలయ ప్రధాన అర్చకులుగా కొనసాగుతున్న నాలుగు వంశాలకు చెందిన మిరాశీ అర్చకుల పదవి సందిగ్ధంలో పడింది. వారికి ఎటువంటి న్యాయం చేస్తారో వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది.
వాయిస్:- శ్రీవారి ఆలయంలోని అర్చకుల మధ్య చిచ్చు పెట్టి పబ్బం గడుపుకోవడానికే కదా ఈ అత్యవసర ఉత్తర్వులు అని కొందరు అంటుంటే... మరికొందరైతే ఎలాగైతే ఏమి రమణ దీక్షితులు పట్టువదలని విక్రమార్కుడు.... తనకున్న పలుకుబడితో అనుకున్నది సాధించారు అని గుసగుసలు వినిపిస్తున్నారు. శ్రీవారి పింక్ డైమండ్ విషయంలో టిటిడి వేసిన పరువు నష్టం కేసుకు సంబంధించి 200 కోట్లకు 2 కోట్లు శ్రీవారి సొమ్ము తిరుపతి కోర్టులో టీటీడీ కట్టింది కదా.... మరి ఆ రెండు కోట్లకు ఇప్పుడు ఎవరు బాధ్యత ఎవరు వహిస్తారనే విమర్శలు వస్తున్నాయి. టిటిడి ఉద్యోగస్తులు కొందరు తెలిసో తెలియకో గతంలో తప్పు చేస్తే.... ఆర్జితం కుంభకోణం కేసు ఇతర చిన్న చిన్న కేసులలో పనిష్మెంట్ పేరుతో కొందరు పదోన్నతులు, ఉద్యోగాలు సైతం కోల్పోయారు. అలాంటి వారికి కూడా న్యాయం జరిగేలా ఆలోచన చేయాలి కదా మరి అనే విమర్శలు వస్తున్నాయి. వడ్డించే వాడు మనవాడైతే వెనక బంతిలో కూర్చున్నా ఏముంది అన్న సామెత రమణ దీక్షితులు విషయంలో గుర్తొస్తుందని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు

Related Posts