YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

శ్రీ త్రిపురసుందరీ దేవి ఆలయం , త్రిపుర

శ్రీ త్రిపురసుందరీ దేవి ఆలయం , త్రిపుర

ఈ ఆలయం చాలా ప్రసిద్ది చెందిన ఆలయం. అష్టాదశ శక్తి పీఠం ఆలయాలకి ఉప ఆలయం ఈ దేవాలయం.  త్రిపురలోని అగర్తాలా నుండి 55 కిలోమీటర్ల దూరంలో కలదు.  ఇక్కడ అమ్మవారు చెరుక గడ , విల్లు , పాశాంకుసాలను ధరించిన రూపంలో , కుడివైపున సరస్వతి దేవి, ఎడమవైపున లక్ష్మీ దేవి , సేవలు చేస్తు ఉండగా , లలితా దేవి భక్తులను అనుగ్రహిస్తుంది. త్రిపుర సుందరి అనగా షోడసి , లలిత మరియు రాజరాజేశ్వరి రూపాలలో ఒక మహా విధ్యలలో స్వరూపమే ఈ అమ్మవారు.  ముల్లోకాలకి సుందరి కావును త్రిపుర సుందరి అంటారు.
ఆలయ చరిత్ర :
అమ్మవారు సతీ దేవి యొక్క ఎడమ కాలు యొక్క చిన్న వేలు ఇక్కడ పడిందని పురాణం చెబుతుంది. ఇక్కడ, ఈ ప్రాంతంలో అమ్మవారిని త్రిపురసుందరగా పూజిస్తారు మరియు పరమశివుని ఇక్కడ భైరవ త్రిపురేష్ గా పూజిస్తారు. ఈ ఆలయాన్ని క్రీ.శ 1501 లో త్రిపుర ధన్య మాణిక్య మహారాజా మూడు అంచెల పైకప్పుతో కూడిన భవనం ప్రధాన మందిరం, బెంగాలీ ఏక్-రత్న శైలిలో నిర్మించారు. పూర్వం ఈ  ఆలయ గర్భగుడిలో దేవత యొక్క రెండు దేవత విగ్రహాలు ఉండేవి. అందులో ఒకటి నల్ల రాతి విగ్రహం 5 అడుగుల ఎత్తు గల పెద్ద విగ్రహం మరియు త్రిపుర సుందరి దేవి యొక్క ప్రముఖ విగ్రహం.  ఇది 2 అడుగుల పొడవు చండి దేవత విగ్రహం. చిన్న విగ్రహాన్ని త్రిపుర రాజులు తమ రాజ్యానికి తీసుకొని వెళ్లారు అని పురాణ కథల ద్వారా తెలుస్తుంది.
పూర్వం దక్ష ప్రజాపతి యాగంని నిర్వహిస్తూ శివునిపై ప్రతీకారం తీర్చుకోవాలనే కోరికతో  శివునకి ఆహ్వానం లేకుండా చేయాలి అని సంకల్పించి యాగం నిర్వహిస్తూ ఉంటాడు. ఈ యగానికి  శివుడు, సతి తప్ప మిగతా దేవతలను యజ్ఞానికి ఆహ్వానించాడు. ఆమెను ఆహ్వానించలేదనే వాస్తవం సత్యానికి యజ్ఞానికి హాజరుకాకుండా అడ్డుకోలేదు. ఆమె వెళ్ళకుండా నిరోధించడానికి తన వంతు ప్రయత్నం చేసిన శివుడికి యజ్ఞానికి హాజరు కావాలని ఆమె కోరికను భర్త అయిన శంభుదేవునికి చెప్పినది. శివుడు చివరికి సతి యజ్ఞానికి వెళ్ళమని చెప్పాడు. ఆహ్వానించబడని అతిథిగా ఉన్న సతికి యజ్ఞంలో గౌరవం ఇవ్వలేదు. ఇంకా, దక్షుడు శివుడిని అవమానించాడు. తన భర్త పట్ల తండ్రి చేసిన అవమానాలను సతి భరించలేకపోయాడు, కాబట్టి ఆమె తనను తాను చలించుకుంది.
అవమానం మరియు గాయంతో కోపంగా ఉన్న శివుడు దక్ష యజ్ఞాన్ని ధ్వంసం చేయవలసినదిగా తన జాఠజూఠం నుంచి వీరభద్ర స్వామిని సృష్టి చేసి దక్ష యజ్ఞాన్ని ధ్వంసంచేస్తాడు, దక్ష యొక్క తలను నరికివేసాడు మరియు తరువాత దానినిమరియొక్క జంతువుతో భర్తీ చేశాడు. తీవ్ర శోకం లో  మునిగిపోయిన శివుడు సతి శరీర అవశేషాలను ఎత్తుకొని, అన్ని సృష్టి అంతటా విధ్వంసం యొక్క ఖగోళ నృత్యం అయిన తాండవను ప్రదర్శించాడు. ఈ విధ్వంసం ఆపడానికి జోక్యం చేసుకోవాలని ఇతర దేవుళ్ళు విష్ణువును అభ్యర్థించారు, అప్పుడూ విష్ణు సతీ యొక్క శరీరాన్ని తన సుదర్శన చక్రంతో అమర అవశేషాలను కత్తిరించి ఉపయోగించాడు. శరీరంలోని వివిధ భాగాలు భారత ఉపఖండం గుండా అనేక ప్రదేశాలలో పడిపోయాయి మరియు ఈ రోజు శక్తి పీఠాలు అని పిలువబడే ప్రదేశాలు ఏర్పడ్డాయి.
పరమేశ్వరుని ఇల్లాలు అగు త్రిపుర సుందరి.  సకల ఐశ్వర్య ప్రధాయిని త్రిపుర సుందరి పురాత్రయంలో రెండో శక్తి లలితా అమ్మవారు. దేవి ఉపసకులకు ఈమె ముఖ్య దేవత. త్రిగుణాతీతమైన కామేవ్వరీ స్వరూపము అమ్మ! పంచదశాక్షరి మహా మంత్రానికి అధిష్టాన దేవత పంచదశాక్షరి మహా మంత్రానికి అధిష్టాన దేవతగా పూజిస్తారు లలితా మహా త్రిపుర సుందరి దేవిని. సకల లోకాతీతమైన కోమలత్వం కలిగిన మాతృమూర్తి అమ్మవారు. దారిద్రయ దుఖాలను తొలగించి దారిద్రయ దుఖాలను తొలగించి, సకల ఐశ్వర్య అభిష్టాలను అమ్మవారు సీధ్ధింప చేస్తుంది.  శ్రీచక్ర ఆరాధన, కుంకుమ అర్చన , లలితా అష్టొత్తరముతో అమ్మని పూజించటం ద్వారా అమ్మ ప్రీతి చెందుతుంది. మాంగళ్య బలాన్ని కోరుతు సువాసీనులు ఈ దేవిని పూజించడం వల్ల తమ ఐదవ తనం నిలబడుతుంది అని భక్తుల నమ్మకం.
ఆలయ దర్శన సమయం :
ఉదయం      : 5.00-12.00
సాయంత్రం  : 3.30-8.00
వసతి సౌకర్యాలు :
ఈ ఆలయానికి కొద్ది దూరంలోనే ప్రైవేట్ సత్రాలు కలవు.
ఆలయానికి చేరుకునే విధానం :
రోడ్డు మార్గం :
ఈ ఆలయానికి దగ్గరలో అగర్తాలా బస్ స్టాండ్ కలదు. జిల్లా నుంచి సాధారణ బస్సులు ఈ ఆలయానికి అందుబాటులో ఉన్నాయి. నుంచి ఈ ఆలయానికి 55కి. మీ దూరంలో కలదు.
రైలు మార్గం :
సమీప రైల్వే స్టేషన్ అయిన మాటబరీ అనే రైల్వే స్టేషన్ కలదు. అనే రైళ్లు కూడా అందుబాటులో ఉన్నాయి.
విమాన మార్గం :
అగర్తలా విమానాశ్రయం సమీప విమానాశ్రయం ఇక్కడి నుంచి కార్ లేదా ప్రైవేట్ వాహనాలు అందుబాటులో ఉన్నాయి. 55 కి. మీ దూరంలో ఈ ఆలయం కలదు.
ఆలయ చిరునామా :
శ్రీ త్రిపుర సుందరీదేవి ఆలయం
గాంధీగ్రామ్,అగర్తలా,త్రిపుర.
ఓం శివ నారాయణాయ నమః

Related Posts