YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

ఆర్కేనగర్ వైపు.... అందరి చూపు

ఆర్కేనగర్ వైపు.... అందరి చూపు

చెన్నై, ఏప్రిల్ 5, 
ఆర్కే నగర్ నియోజకవర్గం తమిళనాడులో ఆసక్తిగా మారింది. మాజీ ముఖ్యమంత్రి జయలలిత 2016 ఎన్నికల్లో ఇక్కడి నుంచే పోటీ చేసి విజయం సాధించారు. తర్వాత ఆమె మృతితో ఆర్కే నగర్ ఉప ఎన్నిక జరిగింది. అయితే ఈ ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్ విజయం సాధించారు. అన్నాడీఎంకే, డీఎంకే అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. బీజేపీకి నోటా కంటే ఓట్లు తక్కువ వచ్చాయి.చెన్నై నగరంలోనే ఆర్కే నగర్ నియోజకవర్గ ముంది. జయలలిత ప్రాతినిధ్యం వహించిన నియోజవర్గం కావడంతో దీనికి ప్రాధాన్యత ఉంది. అయితే ఈ ఎన్నికల్లో దినకరన్ పోటీ చేయడం లేదు. అన్నాడీఎంకే, డీఎంకే, అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం అభ్యర్థులు బరిలో ఉన్నారు. కానీ ఇక్కడ జయలలిత ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశముందని తెలుస్తోంది. ఆర్కే నగర్ నియోజకవర్గాన్ని అన్నాడీఎంకే ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఇక్కడ ప్రచారం నిర్వహించనున్నారు. ఉప ఎన్నికల్లో దినకరన్ విజయం సాధించడానికి అనేక కారణాలున్నాయి. అప్పుడే జయలలిత సన్నిహితురాలు శశికళ అక్రమాస్తుల కేసులో జైలుకు వెళ్లడంతో దినకరన్ కు సానుభూతి ఓట్లు ఎక్కువగా వచ్చాయన్న విశ్లేషణలు ఉన్నాయి. ఇక్కడ ఎక్కువగా పేద, నిరుపేద, మధ్య తరగతి ప్రజలే ఉండటంతో వారిని ఆకట్టుకునేందుకు అన్ని రాజకీయ పార్టీలు ప్రయత్నాలు ప్రారంభించాయి.అమ్మ జయలలిత లేకపోయినా ఆమె నిలుచున్నట్లే భావించి తమకు అవకాశమివ్వాలని ఆర్కే నగర్ అన్నాడీఎంకే అభ్యర్థి ఆర్ఎస్ రాజేష్ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. తండయారుపేట, జేజే నగర్, నెహ్రూనగర్ లో ఇటీవల అన్నాడీఎంకే అగ్రనేతలు సయితం పర్యటించారు. అయితే జయలలిత ప్రభావంతో ఆర్కే నగర్ లో తమ విజయం ఖాయమని అన్నాడీఎంకే నేతలు చెబుతున్నారు. డీఎంకే కూడా ఇక్కడ గెలిచేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తుంది.

Related Posts