YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

యడ్డీ బ్యాక్ స్టెప్..

యడ్డీ బ్యాక్ స్టెప్..

బెంగళూర్, ఏప్రిల్ 5, 
కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్పకు అధినాయకత్వం మరో షాక్ ఇచ్చినట్లుంది. ఆయన పై ఇప్టటికే పార్టీలో అసంతృప్తి పెరడగడంతో యడ్యూరప్పను కట్టడి చేయడానికి నిర్ణయించినట్లు కనపడుతుంది. యడ్యూరప్ప తన కుమారుడిని ఉప ఎన్నికల బరిలో దించాలని భావించారు. త్వరలో జరగనున్న బసవకల్యాణ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావించారు. అయితే దీనికి పార్టీ హైకమాండ్ అంగీకరించినట్లు లేదు.కర్నాటకలో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. బెళగావి లోక్ సభ నియోజకవర్గంతో పాటు మస్కి, బసవకల్యాణ అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదలయింది. అయితే ముఖ్యమంత్రి యడ్యూరప్ప తన కుమారుడు విజయేంద్రను పోటీ చేయించాలని భావించారు. అనేక సార్లు ఆ నియోజకవర్గంలో పర్యటించారు. మొన్నటి వరకూ విజయేంద్ర కూడా బసవకల్యాణ లో పర్యటిస్తూ క్యాడర్ లోనూ తానే అభ్యర్థినని పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు.అందుకే యడ్యూరప్ప గత కొంతకాలంగా బసవ కల్యాణ నియోజకవర్గం అభివృద్ధిపై దృష్టి పెట్టారు. వివిధ అభివృద్ధి పనులకు కూడా నిధులు మంజూరు చేశారు. బసవకల్యాణ నియోజకవర్గంలో వీరశైవ లింగాయత్ సామాజికవర్గం ఎక్కువగా ఉంది. ఈ సామాజికవర్గానికి చెందిన నేతలు, మఠాధిపతులతోనూ విజయేంద్ర తరచూ సమావేశాలు నిర్వహిస్తుండటంతో ఆయనే అభ్యర్థి అని అందరూ భావించారు.కానీ బసవకల్యాణ నియోజకవర్గం నుంచి యడ్యూరప్ప కుమారుడు విజయేంద్ర పోట ీచేసేందుకు అనుమతి లభించలేదు. హైకమాండ్ ఈ విషయంలో నిష్కర్షగా చెప్పినట్లు తెలిసింది. దీంతో యడ్యూరప్ప వెనక్కు తగ్గారు. తన కుమారుడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేదని ఆయనే ప్రకటించారు. మైసూరులో పార్టీని బలోపేతం చేసేందుకు విజయేంద్ర ను అక్కడకు పంపుతున్నామని చెప్పారు. కానీ హైకమాండ్ నో చెప్పినందునే యడ్యూరప్ప తన కుమారుడిని పోటీ చేయించలేకపోయారని పార్టీలో గుసగుసలు విన్పిస్తున్నాయి.

Related Posts