YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం విదేశీయం

ఫోన్ నెంబర్లు... డేటా లీక్

ఫోన్ నెంబర్లు... డేటా లీక్

హైదరాబాద్, ఏప్రిల్ 5, 
ఫోన్ నంబర్లు మరియు ఇతర డేటాతో సహా  500 మిలియన్లకు పైగా ఫేస్‌బుక్  వినియోగదారుల సమాచారాన్ని ఉచితంగా అందిస్తున్నట్లు ఒక లీకర్ ప్రకటించి సంచలనం రేపాడు. ఇజ్రాయెల్ సైబర్ క్రైమ్ ఇంటెలిజెన్స్ సంస్థ హడ్సన్ రాక్ సహ వ్యవస్థాపకుడు అలోన్ గాల్ ప్రకారం, ఆ డేటాబేస్ జనవరి నుండి హ్యాకర్ సర్కిల్‌లలో చెలామణి అవుతున్న ఫేస్‌బుక్-లింక్డ్ టెలిఫోన్ నంబర్‌ లు లానే కనిపిస్తుందని పేర్కొన్నారు.తక్కువ స్థాయి హ్యాకర్ల కోసం ఏర్పాటు చేసిన ఒక ప్రసిద్ధ సైట్‌లో కొన్ని యూరోల విలువైన డిజిటల్ డేటా అందుబాటులో ఉందని చెబుతున్నారు. అయితే తమకు తెలిసిన కొంత మంది ఫోన్ నెంబర్ లతో పోల్చి చూస్తే అది నిజమే అని అంటున్నారు. అయితే ఈ డేటా “చాలా పాతది” మరియు 2019 ఆగస్టులో పరిష్కరించిన సమస్యకు సంబంధించినదని ఫేస్బుక్ ఒక ప్రకటనలో తెలిపింది. మెసేజింగ్ సర్వీస్ టెలిగ్రామ్ ద్వారా లీకర్‌ను చేరుకోవడానికి రాయిటర్స్ చేసిన ప్రయత్నం అయితే విజయవంతం కాలేదు.

Related Posts