YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

టీడీపీ ఓట్లు శాతం తగ్గించడమే లక్ష్యం

టీడీపీ ఓట్లు శాతం తగ్గించడమే లక్ష్యం

తిరుపతి, నెల్లూరు, ఏప్రిల్ 5, 
తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికను ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ ఎన్నికల్లో గెలుపు కంటే మెజారిటీ రావాలని జగన్ భావిస్తున్నారు. వన్ సైడ్ గా రిజల్ట్ రాకపోతే బాగుండదని జగన్ హెచ్చరికలు జారీ చేశారు. తిరుపతి ఉప ఎన్నిక త్వరలో జరగనున్న సంగతి తెలిసిందే. వైసీపీ అభ్యర్థిగా డాక్టర్ గురుమూర్తిని జగన్ ప్రకటించారు. తిరుపతి ఉప ఎన్నికలో నాలుగు లక్షలకు పైగా మెజారిటీ సాధించాలని జగన్ మంత్రులకు లక్ష్యాన్ని నిర్దేశించారు.ఇందుకోసం జగన్ ప్రత్యేకంగా మంత్రులను నియోజకవర్గాల వారీగా నియమించారు. మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, పేర్ని నాని, కొడాలి నాని, కన్నబాబు, బాలినేని శ్రీనివాసులురెడ్డి, ఆదిమూలపు సురేష్, మేకపాటి గౌతమ్ రెడ్డిలను నియోజకవర్గాలకు ఎన్నికల ఇన్ ఛార్జులగా నియమించారు. వీరితో పాటు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి పార్లమెంటు నియోజకవర్గం మొత్తం బాధ్యతలను చూసుకోవాల్సి ఉంటుంది.అభ్యర్థి కొత్త వాడు. పెద్దగా పరిచయం లేదు. ఫేస్ ఇమేజ్ ఉంది. దీనికి తోడు జగన్ సంక్షేమ పథకాలు ఎటూ ఉన్నాయి. పత్యర్థి పార్టీల అభ్యర్థులు మన అభ్యర్థి ముందు ఏమాత్రం సరిపోరు అని జగన్ వ్యాఖ్యానించినట్లు తెలిసింది. గత పార్లమెంటు ఎన్నికల్లో తిరుపతి నియోజకవర్గంలో వైసీపీకి ఏడు లక్షల ఓట్లు వచ్చాయి. టీడీపీ కి దాదాపు నాలుగు లక్షల ఓట్లు వచ్చాయి అప్పుడు వైసీపీ అభ్యర్థి బల్లి దుర్గా ప్రసాదరావు మెజారిటీ 2.28 లక్షల ఓట్లు.ఇప్పుడు జగన్ లక్ష్యం టీడీపీకి గతంలో పడిన ఓట్లను లక్షకు తగ్గించాలన్నదే. తమ పథకాలను చూసి ప్రజలు ఖచ్చితంగా తన అంచనాలను నిజం చేస్తారని జగన్ భావిస్తున్నారు. కనీసం నాలుగు లక్షల మెజారిటీ ఉండాలన్నది జగన్ మంత్రుల ముందు ఉంచిన టార్గెట్. దీంతో మంత్రులకు టెన్షన్ పట్టుకుంది. ఇప్పటికే తమకు కేటాయించిన నియోజకవర్గాల్లో మంత్రులు పర్యటిస్తున్నారు. మెజారిటీ ఎక్కువ రావాలంటే పోలింగ్ శాతం పెరగాలి. అందుకోసం కార్యకర్తలతో నిత్యం సమావేశమవుతున్నారు. మొత్తం మీద తిరుపతి ఉప ఎన్నికల్లో జగన్ విధించిన లక్ష్యం మంత్రులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది.

Related Posts