YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

విజయనగరంలో టీడీపీ డైరక్షన్ లో

 విజయనగరంలో టీడీపీ డైరక్షన్ లో

విజయనగరం, ఏప్రిల్ 5,
విజ‌య‌న‌గ‌రం జిల్లా పార్వతీపురం నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ ప‌రిస్థితి దారుణంగా ఉంద‌నే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇక్కడ కీల‌క నేత‌లు గా ఉన్న మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు, ఎమ్మెల్సీ ద్వార‌పురెడ్డి జ‌గ‌దీష్‌ల వైఖ‌రితో పార్టీ పూర్తిగా దెబ్బతినే ప‌రిస్థితి ఏర్పడింద‌ని తెలుస్తోంది. 2014లో ఇక్కడ నుంచి విజ‌యం సాధించిన టీడీపీ నేత బొబ్బిలి చిరంజీవులు.. గ‌త ఎన్నిక‌ల్లో అదే పార్టీ టికెట్‌పై పోటీ చేసి ఓడిపోయారు. ఇక ద్వార‌పురెడ్డి జ‌గదీష్ ఎమ్మెల్సీగా కొన‌సాగుతున్నారు. అయితే నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్‌గా పార్టీని ప‌ట్టించుకుని ముందుకు న‌డిపించాల్సిన చిరంజీవులు.. ఆ ప‌నివ‌దిలేసి.. జ‌గ‌దీష్ వెంట న‌డుస్తున్నారు.ఈ ప‌రిణామం మంచిదే అయినా.. ఈ ఇద్దరూ క‌లిసి పార్టీని ఏమైనా ముందుకు న‌డిపిస్తున్నారా ? అంటే.. ప్రశ్నార్థకంగా మారిపోయింది.  దీనికి ప్రధాన కార‌ణం.. జ‌గ‌దీష్‌.. కుల స‌మీక‌ర‌ణ‌ల నేప‌థ్యంలో వైసీపీ నాయ‌కుడు, మంత్రి బొత్స స‌త్యనారాయ‌ణ‌కు అనుకూలంగా మారిపోయార‌న్న విమ‌ర్శలు స్థానికంగా ఉన్నాయి. జ‌గ‌దీష్ బొత్స డైరెక్షన్‌లో న‌డుస్తుంటే.. జ‌గ‌దీష్ వెంట న‌డుస్తున్న చిరంజీవులు కూడా ఇదే బాట‌లో ఉన్నారు. ఫ‌లితంగా ఇక్కడ టీడీపీ అంద‌రూ ఉన్న అనాథ‌లా అయిపోయింది. పార్వతీపురం మునిసిపాలిటీ ఎన్నిక‌ల్లో టీడీపీకి బ‌ల‌మైన అభ్యర్థులు ఉన్నప్పటికీ.. వారిని ప‌క్కన పెట్టి ఏమాత్రం బ‌లంలేని నాయ‌కులకు అవ‌కాశం ఇచ్చార‌న్న విమ‌ర్శలు సొంత పార్టీ వ‌ర్గాల్లోనే ఉన్నాయిఇక‌, పార్టీలో నిన్న మొన్నటి వ‌ర‌కు అశోక్ గ‌జ‌ప‌తిరాజు వెంట న‌డిచిన జ‌గ‌దీష్ ఇప్పుడు ఆయ‌న‌కు దూర‌మ‌య్యారు. ఈ ప‌రిణామాల‌తో ఒక‌ప్పుడు టీడీపీకి కంచుకోట‌గా ఉన్న పార్వతీపురంలో ఇప్పుడు టీడీపీకి పార్టీ కార్యక్రమాలే లేవు. మ‌రికొద్ది రోజులు వెయిట్ చేసి పార్టీ పుంజుకుంద‌నుకుంటే ఈ ఇద్దరు నాయ‌కులు పార్టీలో ఉంటార‌ని..లేక‌పోతే.. బొత్స ఆధ్వర్యంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నా.. ఆశ్చర్య ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌ని అప్పుడే కొన్ని అంచ‌నాలు కూడా వ‌స్తున్నాయి. ఆ మాట‌కు వ‌స్తే జ‌గ‌దీష్ పార్టీ మారిపోతార‌ని కొద్ది రోజుల నుంచి ప్రచారం న‌డుస్తోంది.పార్టీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆయ‌న బ‌య‌ట‌కు రాక‌పోవ‌డానికి అధికార పార్టీ నేత‌ల కంట్రోల్ లో ఉండ‌డ‌మే కార‌ణ‌మంటున్నారు. ఇక‌, చంద్రబాబు కూడా ఈ ప‌రిస్థితికి అడ్డుక‌ట్ట వేసే ప్రయ‌త్నాలు చేయ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. మ‌రోవైపు బొత్స వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి జిల్లా మొత్తాన్ని త‌న క‌నుసైగ‌ల‌తో శాసించాల‌ని నిర్ణయించుకున్నారు.. ఈ నేప‌థ్యంలో ప్రధాన ప్రతిప‌క్షాన్ని సాధ్యమైనంత వ‌ర‌కు డైల్యూట్ చేసే చ‌ర్యల‌కు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలోనే జ‌గ‌దీశ్‌ను త‌నకు అన‌ధికార ప్రతినిధిగా మార్చేసుకున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

Related Posts