YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

కోట్ల సుజాతమ్మ కు పోటీ..

 కోట్ల సుజాతమ్మ కు పోటీ..

నల్గొండ, ఏప్రిల్  5, 
నాగార్జున సాగర్ ఉప ఎన్నిక మూడు పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. అయితే ఈ ఎన్నికల్లో బీజేపీ ఎంత మేర ఓట్లు సాధిస్తుందనే ఇప్పుడు ప్రశ్న. నాగార్జున సాగర్ లో బీజేపీ బలం అంతంత మాత్రమే. అక్కడ క్షేత్రస్థాయిలోనూ బీజేపీ పెద్దగా ప్రభావం చూపే పరిస్థితుల్లో లేదు. ఆ సంగతి ఆ పార్టీ నేతలకూ తెలియంది కాదు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయిన కంకణాల నివేదిత జెండా పట్టుకుని తిరిగే నేతగా కన్పిస్తున్నారు.నాగార్జున సాగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్, టీఆర్ఎస్ లు బలంగా ఉన్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా జానారెడ్డి, టీఆర్ఎస్ అభ్యర్థిగా నోముల నరసింహయ్య బరిలో ఉన్నారు. ఇద్దరూ చివరి నిమిషం వరకూ విజయం కోసం పోరాడారు. ఆ ఎన్నికల్లో గెలిచిన టీఆర్ఎస్ కు 46.34 శాతం ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన జానారెడ్డికి 42.04 శాతం ఓట్లు తెచ్చుకున్నారు ఇద్దరి మధ్య ఓట్ల తేడా కేవలం నాలుగు శాతం మాత్రమే.అదే ఎన్నికల్లో బీజేపీకి వచ్చిన ఓట్లు కేవలం 1.48 శాతం మాత్రమే. అయితే దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలిచిన తర్వాత తెలంగాణలో తమ బలం పెరిగిందని బీజేపీ నేతలు భావిస్తున్నారు. తమ ఓట్ల శాతం కూడా పెరిగిందని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఇటీవల జరిగిన పట్బభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ బీజేపీ రెండు స్థానాల్లో ఓటమి పాలయినా తమ ఓట్ల షేర్ పెరిగిందని చెబుతున్నారు. కానీ నాగార్జున సాగర్ లోనూ ఓట్ల శాతం పెరుగుతుందా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది.నాగార్జున సాగర్ ఉప ఎన్నికను భిన్నమైన కోణంలో చూడాల్సి ఉంటుంది. ఇక్కడ బలమైన అభ్యర్థులు ఉండటంతో బీజేపీ తన ఓట్ల శాతాన్ని పెంచుకునే అవకాశం కూడా లేదంటున్నారు. కాంగ్రెస్ బలహీనంగా ఉన్న చోటే బీజేపీ ఓట్ల శాతం పెరుగుతూ వస్తుంది. కానీ సాగర్ లో బీజేపీకి ఆ ఛాన్స్ లేదు. అక్కడ జానారెడ్డి ఉండటం, కాంగ్రెస్ ఓటు బ్యాంకు బలంగా ఉండటంతో సాగర్ లో బీజేపీ పెట్టుకున్న ఆశలు నెరవేరవన్నది ఖచ్చితంగా చెప్పవచ్చు. సాగర్ లో ద్విముఖ పోటీయే జరుగుతుందన్నది విశ్లేషకుల అంచనా.

Related Posts