YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

సాగర్ గెలిచి తీరాల్సిందే

సాగర్ గెలిచి తీరాల్సిందే

హైదరాబాద్, ఏప్రిల్ 5, 
రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలను గెలుచుకున్న ఊపు మీద ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి కేసీఆర్ నాగార్జున సాగర్ ను కూడా దక్కించుకోవాలనుకుంటున్నారు. ఆరు నూరైనా సాగర్ టీఆర్ఎస్ ఖాతాలో పడాల్సిందేనని పార్టీ నేతలకు కేసీఆర్ గట్టి వార్నింగ్ ఇచ్చారు. సాగర్ ఉప ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వం ప్రజల్లో వ్యతిరేకత లేదని చాటి చెప్పాలన్నది కేసీఆర్ ఉద్దేశ్యంగా ఉంది. ఇందుకోసం తరచూ ఆ జిల్లా నేతలతో సమావేశమవుతున్నారు.నాగార్జున సాగర్ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదలయింది. సాగర్ నియోజకవర్గంలో మండలాల వారీగా మంత్రులను ఇన్ చార్జులుగా నియమించాలని కేసీఆర్ నిర్ణయించారు. ఆ మండాలాల్లో టీఆర్ఎస్ కు మెజారిటీ తెచ్చే బాధ్యత ఆ మంత్రులదే. మంత్రులకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను పార్టీ చూసుకుంటుంది. కానీ ఏ మండలంలోనూ మెజారిటీ తగ్గకూడదని ఇప్పటికే కేసీఆర్ మంత్రులకు ఆదేశించారు.రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో మంత్రులు పనితీరు బాగుందని కేసీఆర్ ఇటీవల జరిగిన సమావేశంలో ప్రశంసించారు. సమన్వయం ఉండబట్టే రెండు స్థానాలను సులువుగా గెలుచుకోగలిగామని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. సాగర్ ఉప ఎన్నికల్లోనూ అదే రకమైన వ్యూహాన్ని పాటించాలని కేసీఆర్ మంత్రులకు ఉద్భోదించారు. కులాల వారీగా బాధ్యతలను కూడా కొందరు నేతలకు ప్రత్యేకంగా అప్పగించే పనిలో ఉన్నారు.నాగార్జు సాగర్ ఉప ఎన్నికలో జానారెడ్డి బలమైన అభ్యర్థి. జానారెడ్డి కావడంతోనే అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని కేసీఆర్ నేతలకు సూచించినట్లు తెలిసింది. చిన్న అంశాలను కూడా వదలిపెట్టకుండా అక్కడికక్కడే పరిష్కరించి ప్రభుత్వంపై అసంతృప్తి లేకుండా చూడాలని కేసీఆర్ ఆదేశించారు. ఇక్కడ బీజేపీకి పెద్దగా అవకాశాలు లేకపోవడంతో కాంగ్రెస్ తోనే టీఆర్ఎస్ ఢీకొట్టాల్సి ఉంటుంది. సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాల్సి ఉంటుంది. దుబ్బాక ఓటమి నుంచి నేర్చుకున్న గుణపాఠాలతో సాగర్ ఉప ఎన్నికలో కేసీఆర్ తో పాటు నేతలంతా అప్రమత్తమయ్యారు

Related Posts