YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

అకాల వర్షంతో మామిడికి పురుగులు

అకాల వర్షంతో మామిడికి పురుగులు

అకాల వర్షం ఉద్యాన పంటలపై ప్రభావం చూపింది. పండ్ల తోటలలో కాపునకొచ్చిన కాయలపై చినుకులు పడడంతో తామర పురుగుల బెడద తప్పలేదు. రాష్ట్రంలో చిత్తూరు, కృష్ణా జిల్లాల తర్వాత మామిడి తోటల సాగులో కడప జిల్లా స్థానం దక్కించుకుంది. జిల్లా సగ భాగం బౌగోళికంగా ఉద్యాన తోటల పెంపకానికి అనువైన భూమి ఉంది. రాయచోటి, లక్కిరెడ్డిపల్లె, రాజంపేట, కోడూరు డివిజన్లలోనే మామిడి 80 శాతం సాగులోకి వచ్చింది. ఏటా మామిడి ఎగుమతుల కారణంగానే రూ.200 కోట్లు పైబడి జిల్లాలో వ్యాపార లావాదేవీలు జరుగుతున్నాయి. జాతీయంగానే కాకుండా అంతర్జాతీయంగాను ఎగుమతి కావడంతో అంతర్జాతీయ ద్రవ్య నిధి జిల్లాకు చేరుతోంది. నీటి లభ్యత లేని ప్రాంతాలలోనూ మామిడి సాగు చేసి సీజనల్‌ వర్షాలతోనే తోటలను కాపాడుకొంటున్న రైతులు ఏడాదికి ఒక్కసారి వచ్చే దిగుబడిపై ఆధారపడి కుటుంబ జీవనం సాగిస్తున్నారుకాయపై వాలిన పురుగు కాయ పైభాగంలోని రసం పీల్చేందుకు కంటికి కనిపించని రీతిలో రంధ్రాలు, గోకడం ఎక్కువగా చోటు చేసుకుంది. పురుగుకు లోనైన కాయ సైజు పెరిగే కొద్ది పురుగు తొలచిన రంధ్రాలు, గోకిన ప్రాంతం నల్లగా మసిబారిపోతుంది. కంటికి ఇంపుగా ఉండేలా రూపుదిద్దుకొంటున్న కాయపై నల్లటి చుక్కలు కనిపించడంతో వ్యాపారులు కొనుగోలుకు సంకోచిస్తున్నారు. వారం రోజుల ముందు వరకు టన్ను రూ.80 వేలు వరకు ఉన్న ధర ప్రస్తుతం రూ.50 వేల లోపునకు తగ్గడంతో రైతులు, వ్యాపారుల్లో ఆందోళన నెలకొంది. ఈ ప్రభావం వర్షాలు కురిసిన కొన్ని ప్రాంతాల్లోనే ఉండడంతో మిగిలిన ప్రాంతాల రైతులు ఊపిరి పీల్చుకొంటున్నారు. ఈ సారి మామిడి దిగుబడులు భారీగా తగ్గిపోయాయి. ఏటా జిల్లా నుంచి రాజస్థాన్‌, పూనె, ముంబయి, జమ్ము-కాశ్మీర్‌, గుజరాత్‌, చెన్నై, సూరత్‌, హైదరాబాద్‌ ప్రాంతాలకు భారీగా ఎగుమతి అయ్యేవి. తోటలలో ఉన్న అరకొర కాయలకు అకాల వర్షాలతో ఇలాంటి మచ్చలు ఏర్పడతాయని ఊహించలేదని రైతులు అంటున్నారు.జిల్లాలో వార్షిక ఆదాయం ఇచ్చే పంటలలో మామిడి ప్రధానమైంది. . ఈ సారి తోటలలో కాపు తగ్గడం, దేశంలోని ఇతర రాష్ట్రాలలోనూ జాతీయ మార్కెట్‌కు కాయలు రావడం ఆలస్యం కావడంతో ధరలు మాత్రం కొంత మేర స్థిరీకరణగా ఉంటున్నాయి. ఇటీవల కాయలకు వస్తున్న మంగు చూసి వ్యాపారులు, రైతులు దిగులు చెందుతున్నారు

Related Posts