YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

దద్దరిల్లిన దండకార్యాణం....24 మంది జవాన్ల మృతి జవాన్ల మృతి పై ప్రముఖుల నివాళి

దద్దరిల్లిన దండకార్యాణం....24 మంది జవాన్ల మృతి జవాన్ల మృతి పై ప్రముఖుల నివాళి

రాయ్ పూర్ ఏప్రిల్ 5, 
భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య కాల్పులతో ఛత్తీస్గఢ్ దండకారణ్యం దద్దరిల్లింది. బీజాపూర్లోని తెర్రాం ప్రాంతంలో  జరిగిన భారీ   ఎన్కౌంటర్లో ఇప్పటివరకు 24 మంది జవాన్లు అమరులవగా, మరో 31 మంది జవాన్లకు తీవ్ర గాయాలైనట్లు సమాచారం. ఒక మహిళా మావోతో పాటు మొత్తం 15 మంది మావోయిస్టులు కూడా మృతి చెందినట్టు తెలుస్తుంది. అయితే, మరికొంతమంది జవాన్లు అదృశ్యమయ్యారనే వార్త కలకలం రేపుతోంది. ఈనేపథ్యంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పోలీసు అధికారులు చెప్తున్నారు.  ఎదురు కాల్పుల్లో మృతిచెందిన జవాన్లలో కోబ్రా దళానికి చెందిన ఒకరు, ఎస్టీఎఫ్ విభాగానికి చెందిన ఇద్దరు, డీఆర్జీ విభానికి చెందిన ఇద్దరు జవాన్లు ఉన్నారని పోలీసులు వెల్లడించారు. గాయపడిన జవాన్లను హెలికాప్టర్ల ద్వారా  రాయపూర్, బీజాపూర్ ఆసుపత్రులకు తరలిస్తున్నామని పేర్కొన్నారు. కాల్పులు జరిగిన సమయంలో స్పాట్ లో ఉన్న 760మంది జవాన్లు ఉన్నట్టు తెలిపారు...., ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ ఘటనపై దేశ ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా  ఉన్నతాధికారులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రధాని మోదీ, ఛత్తీస్ గఢ్ సీఏం అమర జవాన్ల మృతి పట్ల సంతాపం ప్రకటించారు....

Related Posts