ఏప్రిల్ 5,
భారత మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. జిల్లా కలెక్టర్ సంగీత సత్యనారాయణ, ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కలెక్టర్ తో పాటు అదనపు కలెక్టర్లు దీపక్ కుమార్, లక్ష్మి నారాయణ, జిల్లా అధికారులు, దళిత సంఘాల నాయకులు జయంతి వేడుకలో పాల్గొన్నారు. కొవిద్ నిబంధనలు పాటిస్తూ ఈ జయంతి వేడుకలు జరిగాయి. ఈసందర్భంగా కలెక్టర్ సంగీత సత్యనారాయణ ...... చిన్న కుటుంబం లో పుట్టి అంచలంచెలుగా ఎదిగి భారత ఉప ప్రధానిగా ఎదిగిన గొప్ప వ్యక్తి బాబు జగ్జీవన్ రామ అని అన్నారు. పేదరికంలో పుట్టిన జగ్జీవన్ రామ్ కార్మిక శాఖ మంత్రిగా, డిఫెన్స్, అగ్రికల్చర్ లాంటి అనేక శాఖలో మంత్రి గా దాదాపు 27 ఏళ్ల పాటు ప్రజల కోసమే అహర్నిశలు కృషి చేశాడని అన్నారు. ఏ పదవిలో ఉన్న కూడా ప్రజల సమస్యల పట్ల పోరాడుతూ అనేక నూతన ఆవిష్కరణలు చేసిన గొప్ప వ్యక్తి జెగ్జీవన్ రామ్ అని అన్నారు. భారత ఉప ప్రధాని గా ఆయన సేవలు మరువలేనివి అని కొనియాడారు. అంతటి మహానుభావుడి అడుగుజాడలలో మనమంతా పనిచేయాలని ఆమె ఆకాంక్షించారు.