నెల్లూరు ఏప్రిల్ 5,
మద్యం అక్రమ ప్రవాహాన్ని నియంత్రిం చాల్సిన అధికారే పూటుగా తాగి వీరంగం సృష్టించారు. మత్తులో మహిళలు, యువకులను అసభ్య పదజాలంతో దూషించారు. ఎస్సైతోనూ దురుసుగా మాట్లాడారు. ఈ ఉదంతం నెల్లూరు జిల్లా కోవూరులో జాతీయ రహదారి పక్కన ఉన్న ఓ హోటల్ వద్ద జరిగింది. విశాఖ జిల్లా ఎస్ఈబీ ఏఎస్పీ శ్రీధర్ అర్ధరాత్రి తన వాహనంలో నెల్లూరు వస్తూ కోవూరులో ఓ హోటల్ వద్ద ఆగారు. టీ తాగేందుకు వచ్చిన యువకులను అసభ్య పదజాలంతో దుర్భాషలా డారు. అటుగా వచ్చిన బస్సులో నుంచి దిగిన మహిళా ప్రయాణికు లనూ దూషించారు. దీంతో కొందరు యువకులు ఏఎస్పీ కారును ధ్వంసం చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై చింతం కృష్ణారెడ్డి వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని విచారిస్తుండగా ఆయననూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. దీంతో శ్రీధర్ను ఎస్పీ కార్యాలయానికి అతన్ని తీసుకెళ్లారు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.