YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

పవన్ కళ్యాణ్ పై మండిపడ్డ మంత్రి కన్నబాబు

పవన్ కళ్యాణ్ పై మండిపడ్డ మంత్రి కన్నబాబు

కాకినాడ ఏప్రిల్ 05 
ఏపీ వ్యవసాయ మంత్రి కురసాల కన్నబాబు జనసేనాని పవన్ కల్యాణ్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పవన్ కల్యాణ్ ఇటీవల తిరుపతిలో చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ... టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే వివేకా హత్య జరిగిందని... ఇంటెలిజెన్స్ చీఫ్ కు, సీఎం రమేశ్ కు మధ్య సంభాషణలు పవన్ కు తెలియదా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే హత్య కేసులో ఆధారాలు తుడిచిపెట్టారని ఆరోపించారు. మరి వివేకా హత్యకేసుపై టీడీపీ ప్రభుత్వాన్ని పవన్ కల్యాణ్ అప్పుడే ఎందుకు ప్రశ్నించలేదని అన్నారు.వివేకా హత్యకేసును సీఎం జగనే సీబీఐకి అప్పగించారని వెల్లడించారు. ప్రస్తుతం వివేకా హత్య కేసుపై సీబీఐ విచారణ జరుగుతోందని పవన్ తెలుసుకోవాలని హితవు పలికారు. సీబీఐకి అప్పగించిన తర్వాత ఏ కేసుతోనైనా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం ఉండదని కన్నబాబు స్పష్టం చేశారు. కేంద్రంలో ఉన్నది మీ మిత్రపార్టీనే కదా... వారి ఆధ్వర్యంలోనే విచారణ జరుగుతుంటే మమ్మల్నెలా తప్పుబడతారు? అని వ్యాఖ్యానించారు. గతంలో టీడీపీ హయాంలో వైఎస్ జగన్ పై హత్యాయత్నం జరిగితే పవన్ ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు.అప్పట్లో పవన్ కల్యాణ్ భారీ డైలాగులు చెప్పారని, ఇప్పుడవన్నీ మర్చిపోయారని విమర్శించారు. తిరుపతి సభలో మోదీ ప్రత్యేకహోదాపై మాటిచ్చిన సంగతి పవన్ కు గుర్తు లేదా? అని కన్నబాబు ప్రశ్నించారు. నాడు పాచిపోయిన లడ్డూలు అంటూ కేంద్రంపై వ్యాఖ్యలు చేసింది ఎవరు? అని నిలదీశారు. విభజన హామీలు గురించి బీజేపీని పవన్ ఎందుకు ప్రశ్నించరు? ప్రత్యేక హోదా, స్టీల్ ప్లాంట్ పై పవన్ ఎందుకు మాట్లాడడం లేదు? అని మండిపడ్డారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి వస్తున్న ప్రజాదరణ చూసి టీడీపీకి భయం పట్టుకుందని.. అందుకే పరిషత్ ఎన్నికల నుంచి ఆ పార్టీ పారిపోయిందని వ్యవసాయశాఖ మంత్రి అన్నారు. తిరుపతి ఉపఎన్నికలో వైఎస్సార్‌సీపీ గెలుపు ఖాయం అయిపోయిందని.. టీడీపీ, బీజేపీ రెండో స్థానం కోసమే పోటీ పడుతున్నాయన్నారు.

Related Posts