YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

మంత్రి అవంతి సమక్షంలో బలిరెడ్డి అప్పారావు వైకాపాలో చేరిక

మంత్రి అవంతి సమక్షంలో బలిరెడ్డి అప్పారావు వైకాపాలో చేరిక

పరవాడ మండలంలో గల పెదముసిడివాడ గ్రామానికి చెందిన బలిరెడ్డి అప్పారావు ఆదివారం మంత్రి అవంతి శ్రీనివాసరావు సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సుమారు 700 మంది కార్యకర్తలతో పార్టీలో  చేరారు. ఈ సందర్భంగా పర్యాటక శాఖ మంత్రి అయిన ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ మంచి మనిషి, నిస్వార్థ పరుడు, ప్రజలకు సేవ చేసే గుణం ఉన్నటువంటి బలిరెడ్డి అప్పారావు మా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లో చేరడం మాకు చాలా ఆనందంగా ఉందని కొనియాడారు. అంతేకాకుండా ఆయన ఈ ఒక్క గ్రామానికి చెందిన వ్యక్తి కాదని విశాఖపట్నం జిల్లా మొత్తం ప్రజలు ఆయన చేసిన సేవలు ను మరువలేరని అన్నారు. అనంతరం పెందుర్తి ఎమ్మెల్యే అన్నం రెడ్డి అదీప్ రాజు మాట్లాడు తు బలిరెడ్డి అప్పారావు గారికి వైయస్సార్ పార్టీ లో సముచిత స్థానం కల్పిస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. అలాగే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత అత్యధిక నిధులు పెదముసిడివాడ గ్రామానికి మంజూరు చేశానని ఈ సందర్భంగా అన్నారు. కోటి 23 లక్షలు రూపాయలతో హైస్కూల్ నిర్మాణం చేపట్టామని దీంతోపాటు సిసి రోడ్లు, సచివాలయం, రైతు భరోసా కేంద్రం వంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఈ గ్రామానికి నిధులు మంజూరు చేసి నిర్మాణం చేపట్టామని అన్నారు. అలాగే ఈ పంచాయతీ లో ఉన్న ప్రతి ఇంటికి త్రాగునీరు కులాయి ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. బలిరెడ్డి అప్పారావు కలయికతో ప్రెసిడెంట్ అయిన కబాడీ అప్పారావు చేదోడుగా ఉంటూ గ్రామాన్ని మరింత అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నానని అన్నారు. మాజీ ఎమ్మెల్యే గురుమూర్తి రెడ్డి మాట్లాడుతూ ఆయన సేవలు పొందని వ్యక్తి ఉండదని కొనియాడారు. బలిరెడ్డి అప్పారావు తోపాటు పరవాడ మాజీ జెడ్పిటిసి బి వెంకటరమణ సతీ సమేతంగా వైకాపాలో చేరడం పెందుర్తి నియోజకవర్గం లో వైసీపీ పార్టీకి అన్ని  జడ్పీటీసీలు వైయస్సార్ సిపి పార్టీ కైవసం చేసుకుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సీఈసీ సభ్యులు పైలా శ్రీనివాసరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి చుక్క రామనాయుడు, 60 వ వార్డు కార్పొరేటర్ పి.వి సురేష్, పరవాడ జడ్పిటిసి అభ్యర్థి పి ఎస్ రాజు, పెదముసిడివాడ ఎంపీటీసీ అభ్యర్థి నంద వరపు శ్రీనివాస రావు, వైయస్సార్ పార్టీ సీనియర్ నాయకులు తోట రాజీవ్, వైయస్సార్ పార్టీ సీనియర్ నాయకులు వై బుజ్జి, పలువురు నాయకులు, కార్యకర్తలతోపాటు భారీ ఎత్తున ప్రజలు పాల్గొన్నారు.

Related Posts