రాష్ట్ర వ్యాప్తంగా 8వ తేదీన జరిగే ఎంపీటీసీ మరియు జెడ్పిటిసి ఎన్నికలకు సంబంధించి పటిష్ఠ బందోబస్తును ఏర్పాటు చేసినట్టు పత్తికొండ రూరల్ సి.ఐ ఆదినారాయణ రెడ్డి తెలియజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుగ్గలి మండల వ్యాప్తంగా 17 ఎంపిటిసి స్థానాలకు నిర్వహించే పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక బలగాలతో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేసినట్లు పత్తికొండ రూరల్ సిఐ డి.వి ఆదినారాయణ రెడ్డి తెలియజేశారు.తుగ్గలి మండల వ్యాప్తంగా 17 ఎంపీటీసీ స్థానాలకు గాను 56 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారని,ప్రతి పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేస్తామని ఆయన తెలియజేశారు. పోలింగ్ రోజున మరియు ఫలితాలు వెలువడే రోజున గ్రామాలలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు ను ఏర్పాటు చేస్తామని ఆయన తెలియజేశారు. అత్యంత సమస్యాత్మకమైన కడమకుంట్ల, చెన్నంపల్లి,జొన్నగిరి,రాంపల్లి మరియు ఎద్దుల దొడ్డి గ్రామాలలో గల పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక దృష్టి సాధించామని ఆయన తెలియజేశారు.ఎన్నికల నేపథ్యంలో డ్రోన్ లను మరియు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి శాంతి భద్రతలను పరిరక్షిస్తామని ఆయన తెలియజేశారు.ఎన్నికల నిర్వహణకు ఇబ్బంది కలిగించే ఎటువంటి వారైనా ఉపేక్షించేది లేదని, వారిపై చట్టపరమైన కేసులు నమోదు చేసి కఠిన శిక్షలు విధిస్తామని ఆయన తెలియజేశారు. తుగ్గలి మరియు జొన్నగిరి ఎస్.ఐ లు నాగేంద్ర, సురేష్ ఆధ్వర్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసినట్టు రూరల్ సి.ఐ డి.వి ఆదినారాయణ రెడ్డి తెలియజేశారు.