YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

ఆదానీ పరం..కృష్ణ పట్నం

ఆదానీ పరం..కృష్ణ పట్నం

నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్టును అదానీ సంస్థ పూర్తిగా కొనుగోలు చేసింది. 100 శాతం యాజమాన్య హక్కులను అదానీ సంస్థ దక్కించుకుంది.నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం పోర్టు పూర్తిగా అదానీ వశమైంది. పోర్టు యాజమాన్య హక్కులను అదానీ పోర్ట్స్‌ సంస్థ దక్కించుకుంది. పోర్టులో వంద శాతం పెట్టుబడుల్ని అదానీ గ్రూప్‌ దక్కించుకుంది. 2020లో 75 శాతం వాటాను కొనుగోలు చేసిన అదానీ సంస్థ.. తాజాగా విశ్వ సముద్ర హోల్డింగ్స్‌ నుంచి మరో 25 శాతం వాటాను కొనుగోలు చేసింది. దీంతో 100 శాతం పెట్టుబడులు కలిగిన అదానీకి కృష్ణపట్నం పోర్టు యాజమాన్య హక్కులన్నీ సొంతమయ్యాయి. ఈ మేరకు ఈ సంస్థ సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. తాజాగా, కొనుగోలు చేసిన 25 శాతం వాటా విలువ రూ.2,800 కోట్లుగా తెలిపింది.దీంతో కృష్ణపట్నం పోర్టు యాజమాన్య హక్కులు అదానీ పోర్ట్సుకు వంద శాతం బదిలీ కానున్నాయి. 2020- 21లో పోర్టు మొత్తం విలువ రూ.13,675 కోట్లు ఉన్నట్లుగా అదానీ పోర్ట్సు వెల్లడించింది. ప్రస్తుత హ్యాండిలింగ్‌ సామర్థ్యం 64 మిలియన్‌ టన్నులుగా ఉందని.. 2025 నాటికి దీన్ని 200 నుంచి 300 మిలియన్‌ టన్నులకు పెంచేందుకు ప్రయత్నిస్తామని సంస్థ వెల్లడించింది. అంతేకాకుండా ఈ పోర్టును గేట్‌వే ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌గా తయారు చేస్తామని చెప్పుకొచ్చింది.కృష్ణపట్నం పోర్ట్‌ ఒక డీప్‌ వాటర్‌ నౌకాశ్రయం. ఈ పోర్టు వార్షిక సామర్థ్యం 6.4 కోట్ల టన్నులు. మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఈ పోర్టు 3.8 కోట్ల టన్నుల సరకు రవాణా చేసి.. రూ. 1,840 కోట్ల ఆదాయాన్ని, రూ. 1,325 కోట్ల నికర లాభాన్ని ఆర్జించే అవకాశం ఉందని భావిస్తున్నారు. సరకు రవాణా సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుకోవాలనే తమ లక్ష్యానికి అనుగుణంగా కృష్ణపట్నం పోర్టును పూర్తిగా కొనుగోలు చేసినట్లు అదానీ పోర్ట్స్‌ సీఈవో కరణ్‌ అదానీ పేర్కొన్నారు. ఈ పోర్టు సామర్థ్యాన్ని 50 కోట్ల టన్నులకు విస్తరించే అవకాశం ఉందని తెలిపారు. కాగా, అదానీ పోర్ట్స్‌ అండ్‌ ఎస్‌ఈజెడ్‌ ఇటీవలే గంగవరం పోర్టులో సైతం మెజారిటీ వాటాదారుగా మారిన విషయం తెలిసిందే. తాజాగా, కృష్ణపట్నం పోర్టును పూర్తిగా కొనుగోలు చేసింది.

Related Posts