YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం దేశీయం

నిర్మల కామెంట్స్ తో దూమారం

నిర్మల కామెంట్స్ తో దూమారం

కేరళ అసెంబ్లీ ఎన్నికల వేళ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శబరిమలైలో మహిళల ప్రవేశానికి సంబంధించి ఆమె చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా హీట పుట్టించాయి. వామపక్ష ప్రభుత్వం శబరిమలై ఆలయంలోకి మహిళలను దొంగతనంగా పంపించిందని నిర్మల సంచలన ఆరోపణలు చేశారు. అయ్యప్ప భక్తుల కానివారిని ఆలయంలోకి పంపించి.. అక్కడ లాల్‌సలాం చెప్పించేందుకు కుట్రపూరితంగా వ్యవహరించిందని ఆమె మండిపడ్డారు.అయ్యప్ప ఆలయంలోకి 10 నుంచి 50 ఏళ్లలోపు మహిళలను అనుమతిస్తూ సుప్రీం కోర్టు తీర్పును అమలు చేస్తామంటూ వామపక్ష ప్రభుత్వం అమానుషంగా వ్యవహరించిందని నిర్మల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయ సంప్రదాయాలను తుంగలో తొక్కొద్దని అయ్యప్ప భక్తులు, బీజేపీ, పలు హిందూ సంఘాలు, ఆందోళన చేసినప్పటికీ పోలీసులను ఉసిగొల్పి నలభై ఏళ్ల మహిళలను ఆలయ దర్శనానికి అనుమతిచ్చిందన్నారు. భక్తులు ఆందోళన చేస్తున్నా పోలీసు పహారా నడుమ మహిళలను అయ్యప్ప దర్శనం చేయించిందన్నారు.మహిళలకు ఆలయ ప్రవేశం వెనక కమ్యూనిస్టు ప్రభుత్వం కుట్ర ఉందని.. అయ్యప్పను భక్తితో దర్శించుకోకుండా.. ఆలయం ముందు లాల్ సలాం అంటూ కమ్యూనిస్ట్ స్లోగన్ వినిపించేందుకేనని ఆమె మండిపడ్డారు. అయ్యప్ప ఆలయంలోకి మహిళలను అనుమతించడం.. భక్తులపైకి పోలీసులను పంపించడం ద్వారా మంత్రి కడకంపల్లి సురేంద్రన్ ఘోర పాపం చేశారని.. 500 ఏళ్లు తపస్సు చేసినా ఆయన పశ్చాత్తాపం పొందలేరని ఆమె అన్నారు.అంతే కాకుండా గత యూడీఎఫ్, ప్రస్తుత ఎల్డీఎఫ్ ప్రభుత్వాలు అవినీతిలోనూ పోటీపడుతున్నాయని ఆమె విమర్శించారు. గోల్డ్ స్కామ్, విదేశీ కరెన్సీ స్కామ్, సోలార్ స్కామ్‌లతో ఇద్దరూ పోటీ పడుతున్నారని ఆమె అన్నారు. కేరళ ప్రజల సంక్షేమం పాలకులకు పట్టడం లేదని.. జేబులు నింపుకోవడమే పనిగా పెట్టుకున్నారంటూ తీవ్ర విమర్శలు చేశారు. ఎల్డీఎఫ్ అవినీతిపై ప్రశ్నిస్తే తమ సోలార్ స్కామ్ గురించి బయటపెడతారేమోనని కాంగ్రెస్ సారథ్యంలోని యూడీఎఫ్ నోరుమెదపడంలేదని ఆమె అన్నారు. ఇలాంటి పార్టీలు మనకు కావాలా? అని నిర్మల పశ్నించారు.

Related Posts