YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

బలపడుతున్న ధాక్రే

బలపడుతున్న ధాక్రే

ముంబై, ఏప్రిల్ 6, 
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే క్రమంగా బలపడుతున్నారు. మిత్ర కూటమిలోనూ తన గ్రిప్ లోకి తెచ్చుకునేలా ఆయనకు అన్ని పరిణామాలు సహకరిస్తున్నాయి. సంకీర్ణ సర్కార్ లో ఎలాంటి చిన్న సంఘటనైనా ప్రభుత్వం కూలిపోవడానికి కారణమవుతుంది. అయితే మహారాష్ట్రలో మాత్రం ఉద్ధవ్ థాక్రేకు పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయి. కూటమిలోని పార్టీలు నోరు ఎత్తకుండా థాక్రేకు అలా కలసి వస్తున్నాయి.మహారాష్ట్రలో ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వం ఏర్పడి దాదాపు పథ్నాలుగు నెలలు కావస్తుంది. ఈ పథ్నాలుగు నెలల్లోనూ ఆయన ముఖ్యమంత్రిగా సక్సెస్ అయ్యారు. కరోనా కట్టడి విషయంలో కొంత విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ పాలన మాత్రం సజావుగానే సాగుతుంది. అయితే అదే సయమంలో ఉద్ధవ్ థాక్రే ఏ నిర‌్ణయం తీసుకోవాలన్నా ఎన్సీపీ నేత శరద్ పవార్ పై ఆధారపడతారన్న విమర్శలు కూడా ఎక్కువగా ఉన్నాయి.లాక్ డౌన్ మినహాయింపుల విషయంలో శరద్ పవార్ చెప్పినట్లే ఉద్థవ్ థాక్రే నడుచుకున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. శరద్ పవార్ రిమోట్ కంట్రోల్ ద్వారా ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారన్న కామెంట్స్ కూడా విపక్షాల నుంచి విన్పిస్తున్నాయి. అయినా ఉద్థవ్ థాక్రే మాత్రం శరద్ పవార్ కు ఇవ్వాల్సిన గౌరవం ఇస్తూనే తన పనితాను చేసుకుపోతున్నారు. ముఖ్యమైన నిర్ణయాల్లో ఆయన ప్రమేయం తప్పనిసరి అంటున్నారు. కాంగ్రెస్ ను పెద్దగా కేర్ చేయకపోయినా శరద్ పవార్ విషయంలో ఉద్ధవ్ థాక్రే అత్యంత వినయ విధేయతను పాటిస్తున్నారు.అయితే ఇటీవల రాష్ట్ర హోంశాఖమంత్రి, ఎన్సీపీ నేత అనిల్ దేశ్ ముఖ్ పై వచ్చిన ఆరోపణలతో శరద్ పవార్ ఇరకాటంలో పడ్డారు. నెలకు వంద కోట్లు వసూలు చేయమన్నారని హోంమంత్రిపై మాజీ పోలీస్ కమిషనర్ పరమ్ వీర్ సింగ్ చేసిన ఆరోపణలు అట్టుడుకుతున్నాయి. శరద్ పవార్ ఆయనను విధిలేని పరిస్థితుల్లో సమర్ధించాల్సి వచ్చింది. కాంగ్రెస్ కూడా ఈ విషయంపై నోరు మెదపలేదు. ఇది ఒకరకంగా ఉద్ధవ్ థాక్రేకు మంచిదేనంటున్నారు. భవిష్యత్ లో తాను బలపడేందుకు ఇటువంటి సంఘటనలు ఉపయోగపడతాయని భావిస్తున్నారు.

Related Posts