YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం తెలంగాణ

కరోనాతో మిగిలిన రోగులు మాయం

 కరోనాతో మిగిలిన రోగులు మాయం

ఖమ్మం, ఏప్రిల్ 6 
కంటికి కనిపించని మహమ్మారి కలవరపెడుతున్నా మిగతా కొందరి పరిస్థితి మాత్రం ప్రశాంతంగా తయారైనట్టు అనిపిస్తున్నది. కడుపునొచ్చినా, కాలునొచ్చినా ప్రయివేటు ఆస్పత్రులవైపు పరుగులు పెట్టడంమాని తేరుకుంటున్నట్టు తెలుస్తున్నది. ప్రయివేటు ఆస్పత్రుల్లో ఓపీలు పూర్తిగా నిలిచిపోవడంతో కాదనకుండా ప్రభుత్వ ఆస్పత్రులవైపే వెళ్లాల్సి వస్తున్నది. చిన్నాచితకా సమస్యలుంటే సర్కారు డాక్టర్లు ఇచ్చే మందులతో సరిపెట్టుకుంటూ.. అవసరం లేని టెస్టుల పేరిట చేసే ఖర్చు దూరం చేసుకుంటున్నారు. ప్రభుత్వ వైద్యమూ ఇప్పుడిప్పుడే ప్రజలకు దగ్గరవుతుండగా కార్పొరేట్‌ దవాఖానాల యజమానుల్లో కలవరం మొదలవుతున్నది.ఖమ్మం జిల్లాలో మొత్తం 480 ప్రయివేటు ఆస్పత్రులుండగా, ఒక్క జిల్లా కేంద్రంలోనే సుమారు 270 ఆస్పత్రులున్నాయి. ఖమ్మం, మహబూబాబాద్‌, సూర్యాపేట, భద్రాద్రి, కృష్ణా, భూపాలపల్లి జిల్లాలకు చెందిన రోగులు నగరంలోని వివిధ ప్రయివేటు ఆస్పత్రులకు నిత్యం వేల సంఖ్యలో వస్తుంటారు. ప్రయివేటు ఆస్పత్రులు సహా ఖమ్మం ప్రభుత్వ ప్రధాన వైద్యశాల కూడా ఉంది. ప్రభుత్వ వైద్యశాలకు రోజూ 1500 నుంచి 1800మంది వరకూ రోగులు వచ్చేవారు. జిల్లా కేంద్రంలోని ప్రధానమైన 10 ప్రయివేటు ఆస్పత్రుల్లో నిత్యం 300 మందికి తగ్గకుండా రోగులు చికిత్స కోసం ఆశ్రయించేవారు. మిగిలిన ప్రయివేటు ఆస్పత్రులకు సైతం జనం భారీగానే వచ్చేవారు. వేలాది మంది రోగులతో ఆస్పత్రుల్లో రక్తపరీక్షలు, ఎక్స్‌రేలు, ఇతరత్రా పరీక్షలు మొదలు మందుల కొనుగోళ్లు కలిపి నిత్యం రూ.3కోట్ల లావాదేవీలు జరుగుతుండేవి. జిల్లాలో గతేడాది ఆగస్టులో విషజ్వరాలు, డెంగ్యూ తదితర వ్యాధులు విజృంభించడంతో సుమారు 2.30లక్షల మంది మంచం పట్టగా అందులో 50వేల మంది ప్రభుత్వాస్పత్రిలోనే ఉచిత వైద్యం పొందారు. ప్రయివేటు ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకున్న కారణంగా లక్షా 80 వేల మంది సగటున ఒక్కొక్కరు రూ.10 వేలు ఖర్చుచేసినా రూ.180 కోట్లు చేజార్చుకున్నట్టయింది.రోజూ వేలాది మందితో కిటకిటలాడే ప్రయివేటు ఆస్పత్రులు రెండువారాలుగా మూతపడ్డాయి. కానీ జనం మాత్రం బాగానే ఉన్నట్టు కనిపిస్తోంది. అత్యవసర కేసులైన గుండెజబ్బులు, రోడ్డు ప్రమాదాలు, ప్రసవాలు, సర్జరీ వైద్యం కావాల్సిన వారు వెంటనే 108కు ఫోన్‌ చేసి ఆపదనుంచి గట్టెక్కుతున్నారు. 24గంటలూ ప్రభుత్వ ఆస్పత్రులు, వైద్యులు అందుబాటులో ఉంటున్నారు. దీంతో రోగులు ప్రయివేటు ఆస్పత్రుల మాటెత్తడం లేదు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలకు గ్రామాల్లో ఉండే ఆర్‌ఎంపీలు ఆపదకాలంలో ఆదుకుంటున్నారు. ప్రతి మండలంలోనూ ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు నిత్యం తెరిచి ఉండటంతో రోగులు ఉపశమనం పొందుతున్నారు. ప్రభుత్వ మాతా శిశు ఆస్పత్రిలో మాత్రం నేటికీ 450 మంది వరకూ యథావిథిగా ఓపీ కొనసాగుతుండటం గమనార్హం. ప్రయివేటు వైద్యం అందుబాటులో లేకున్నా ప్రభుత్వ వైద్య శాలల్లో రోగులకు ఉచిత వైద్యం అందడం పట్ల సంతోషం వ్యక్తమవుతున్నది. ఇదే ఒరవడి కొనసాగి మెరుగైన వైద్యసేవలు మరిన్ని అందుబాటులోకి వస్తే తమ భవిష్యత్‌ ఏమిటని ప్రయివేటు ఆస్పత్రుల యజమానులు ఆందోళన చెందుతున్నారు.లాక్‌డౌన్‌ ప్రకటించిన నాటినుంచి ప్రభుత్వ ఆస్పత్రులకు రోగుల సంఖ్య పెరిగింది. మిగతా రోజుల్లోనూ ప్రజలు ఇలాగే వచ్చి ఉచిత వైద్యసేవలు పొందాలి. ప్రయివేటు ఆస్పత్రుల్లో చేరి లక్షల రూపాయలు చేజార్చుకోవద్దు. సర్కారు డాక్టర్లే మంచి అనుభవం కలవారు. ప్రజల్లో ప్రభుత్వ వైద్యంపై పూర్తిస్థాయిలో స్పందన రావాల్సి ఉంది. ప్రయివేటులోనూ అత్యవసర కేసులు మినహా ఎలాంటి కేసులూ చేర్చుకోవద్దని ఆదేశాలిస్తున్నారు

Related Posts