YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

పొగ పెడుతన్న పోగాకు

 పొగ పెడుతన్న పోగాకు

పొగాకు కొనుగోళ్లలో మాంద్యం ఏర్పడింది. కర్నాటకలో సీజన్ ముగిసి, ఏపీలో నెలరోజుల క్రితం కొనుగోళ్లను ప్రారంభించారు. గిట్టుబాటు ధర లేకపోవటంతో రైతులు బేళ్లను అమ్మకానికి తరలించే విషయంలో ఆచితూచి అడుగేస్తున్నారు. ఈ ఏడాది గత ఏడాది నుంచి ఎగుమతులు కూడా తగ్గుముఖం పట్టాయి.దేశం నుంచి ప్రధానంగా జర్మనీ, ఈజిప్టు, కొరియా, బెల్జియం, రష్యా, నేపాల్‌తో పాటు మరో 65 దేశాలకు మన దేశం నుంచి పొగాకు ఎగుమతి జరుగుతోంది.  మూడేళ్ల క్రితం అత్యధిక విదేశీ మారక ద్రవ్యం సమకూరింది. గత ఏడాది 109777 మెట్రిక్ టన్నుల మేర బేరన్ పొగాకు ఎగుమతుల ద్వారా రూ. 2699 కోట్లు, 50వేల 179 మెట్రిక్ టన్నుల మేర పొగాకు ఉత్పత్తుల ఎగుమతుల ద్వారా రూ. 722 కోట్లు, సిగరెట్లు, ఇతర ఉత్పత్తులకు సరఫరా చేసిన 27వేల 187 మెట్రిక్ టన్నుల ద్వారా రూ. 1450 కోట్లు వెరసి 4వేల 870కోట్ల ఆదాయం లభించింది. అదే 2016-17 సంవత్సరంలో 2లక్షల 8వేల 128 మెట్రిక్ టన్నులు ఎగుమతి కాగా రూ. 5365 కోట్లు, 2015-16లో 2లక్షల 43వేల 400 మెట్రిక్ టన్నులకు గాను రూ. 6,050 కోట్ల విదేశీ మారక ద్రవ్యం సమకూరింది. 2020 నాటికి పొగాకు రహిత సమాజం నినాదంతో అంతర్జాతీయ ఒప్పందం ప్రకారం ఏటా పొగాకు సాగుపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధిస్తోంది. ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్‌లో 136 మిలియన్ కిలోల ఉత్పత్తి లక్ష్యంగా నిర్ణయించింది. ప్రపంచవ్యాప్తంగా 2040 నాటికి 40శాతం పొగాకు ఉత్పత్తుల వినియోగాన్ని తగ్గించాల్సి ఉంది. ఇప్పటికే భారత్‌లో 40 శాతానికి వినియోగం తగ్గింది. పొగాకుకు ప్రత్యామ్నాయ మార్గాలు లేక రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో రైతులు సాగు చేస్తున్నారు. గతంలో 160 మిలియన్ కిలోలు ఉత్పత్తి లక్ష్యంగా నిర్దేశించగా అది ప్రస్తుతం 136 మిలియన్ కిలోలకు తగ్గింది. అయితే కొన్ని ప్రాంతాల్లో అనధికార సాగుతో రైతులు నష్టపోతున్నామని చెపుతున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 18 నాటికి 45వేల 972 బేళ్లు కొనుగోలు చేయగా, గత ఏడాది ఇదే కాలానికి లక్షా 17వేల 752 బేళ్ల విక్రయాలు జరిగాయి. ప్రస్తుతం ప్రకాశం, నెల్లూరు, పశ్చిమ గోదావరి మినహా తూర్పుగోదావరి జిల్లాలో నాణ్యతా ప్రమాణాల సాకుతో వ్యాపారులు తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారని రైతులు చెపుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా తొర్రేడు వేలం కేంద్రంలో 157 రూపాయల ధర కొనసాగుతోంది. కాగా ప్రకాశం జిల్లా వెల్లంపల్లి-2, ఒంగోలు-1, 2, టంగుటూరు-1, 2, కొండెపి, నెల్లూరు జిల్లాలోని పొదిలి-1, కందుకూరు-1, 2, కలిగిరి, కనిగిరి, డీసీ పల్లి కేంద్రాల్లో నాణ్యతను బట్టి రూ. 90 నుంచి రూ. 154, రూ. 161 నుంచి రూ. 165 వరకు ధర పలుకుతోంది. పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లి, జంగారెడ్డిగూడెం-1, 2తో పాటు కొయ్యలగూడెం, గోపాలపురంలో అత్యధికంగా 165 రూపాయల ధరకు కొనుగోళ్లు జరుపుతున్నారు. సరాసరిన ఇప్పటివరకు తక్కువ ధర కిలోకు 90 నుంచి 154 రూపాయల మేర కొనుగోళ్లు జరుగుతున్నాయి. గత ఏడాది సీజన్‌లో కిలోకు రూ. 200 ధర చెల్లించారు. అయితే డీలర్లు, ఎగుమతిదార్ల మధ్య క్రయవిక్రయాల్లో వ్యత్యాసం కారణంగా గత ఏడాది నుంచి ఎగుమతులు తగ్గుముఖం పట్టాయి. కేంద్ర ప్రభుత్వం ఐదేళ్లకోసారి పొగాకు వాణిజ్యంపై విధివిధానాల సమీక్ష జరుపుతుంది. పొగాకు ఉత్పత్తులు, వ్యాపారానికి మినహాయింపులు, ప్రోత్సాహకాలు రద్దు చేయటంతో ఆ ప్రభావం అంతర్జాతీయ మార్కెట్‌పై పడింది. గతంలో ఎగుమతులకు ఆర్థిక వెసులుబాటుతో పాటు పన్నుల్లో రాయితీ ఉండేది. ప్రస్తుతం వీటిని ఎత్తివేయటంతో పాటు ఎగుమతి వ్యాపారులపై 5 నుంచి 18 శాతం వరకు జీఎస్టీ భారం పడుతోంది. దీనికితోడు చైనా, తదితర దేశాల్లో అంతర్గతంగా ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయటంతో ప్రపంచ మార్కెట్‌లో భారతీయ పొగాకుకి గిరాకీ తగ్గుతోంది

Related Posts