న్యూఢిల్లీ ఏప్రిల్ 6
కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌లను హతమారుస్తామంటూ వచ్చిన ఓ బెదిరింపు ఈమెయిల్ కలకలం సృష్టించింది. ముంబైలోని సీఆర్పీఎఫ్ ఆఫీస్‌కు మంగళవారం ఉదయం ఈ ఈమెయిల్ వచ్చింది. ఆత్మాహుతి దాడుల ద్వారా ఆ ఇద్దరినీ చంపేస్తామంటూ ఆ మెయిల్‌లో హెచ్చరించారు. అంతేకాదు ప్రార్థనా మందిరాలు, ఇతర ముఖ్యమైన ప్రదేశాల్లోనూ దాడులు చేస్తామని హెచ్చరించడం గమనార్హం.