YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం తెలంగాణ

కరోనా నివారణకు పకడ్భంది చర్యలు... రాష్ట్ర ముఖ్య కార్యదర్శీ సోమేష్ కుమార్

కరోనా నివారణకు  పకడ్భంది చర్యలు... రాష్ట్ర ముఖ్య  కార్యదర్శీ సోమేష్ కుమార్

జగిత్యాల ఏప్రిల్ 06
 కరోనా వ్యాధి నియంత్రణకు  పకఢ్భందిగా  చర్యలు చేపట్టాలని  రాష్ట్ర ముఖ్య  కార్యదర్శి  సోమేష్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కరోనా వ్యాక్సినేషన్,  పరీక్షల నిర్వహణ,  కరోనావ్యాప్తి నివారణ చర్యలపై  కలెక్టర్లతో  బుధవారం హైదరాబాద్ నుండి  సీఎస్  వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు.  ఈ సందర్బంగా సిఎస్ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా మరోసారి కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతుందని, దీనిని దృష్టిలో ఉంచుకొని  కరోనా నియంత్రణ  చర్యలను  పకడ్భందిగా చేపట్టాలని ఆదేశించారు.   కరోనా నిర్దారణ పరీక్షల సంఖ్యను గణనీయంగా పెంచేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.  జిల్లా పరిధిలో ఉన్న ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో కనీసం 100 పరీక్షలను,  సామాజిక ఆరోగ్య కేంద్రాలలో 150 పరీక్షలను,  సివిల్ ఆసుపత్రిలో 300 టెస్టులను ప్రతి రోజు నిర్వహించాలని, వాటి ఫలితాలను  కోవిడ్  యాప్ లో ఎప్పటికప్పుడు నమెదు చేయాలని అన్నారు.   కరోనా పరీక్షల ఫలితాల ఆధారంగా  కోవిడ్ వ్యాప్తిస్తున్న వారిని గుర్తించి వారిని  హోం క్వారంటైన్ చేయాలని,  ఇళ్లలో వసతి లేనివారి కొరకు  ప్రభుత్వ క్వారంటైన్ హోంలకు తరలించేలా అవసరమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లకు సూచించారు.  కరొనా అధికంగా వ్యాప్తి చెందుతున్న ప్రాంతాలను గుర్తించి  సదరు  ప్రాంతాలో  ప్రత్యేక పారిశద్ద్య చర్యలు చేపట్టాలని, జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామాలలో, పట్టణాలలో పారిశుద్ద్య చర్యలు పకడ్భందిగా నిర్వహించాలని ఆదేశించారు.   ప్రభుత్వ ఆదేశాల మేరకు 45 సంవత్సరాలు పైబడిన ప్రజలకు వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా పూర్తి చేయాలని,  జిల్లాలో  కరొనా వ్యాక్సినేషన్  లక్ష్యాల  మేరకు పూర్తి చేయాలని  సూచించారు. ప్రతి  పి.హెచ్.సి  పరిధిలో 125 మందికి, సి.హెచ్.సి పరిధిలో 250 మందికి, సివిల్ ఆసుపత్రి పరిధిలో 300 మందికి ప్రతి రోజు కరోనా వ్యాక్సినేషన్ అందించాలని ఆదేశించారు.   ఏప్రిల్ 30 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి సామూహిక కార్యక్రమాలు, సభలకు అనుమతి ఇవ్వరాదని,  ప్రజలు తప్పనిసరిగ్గా మాస్కులు వినియోగించేలా చర్యలు తీసుకోవాలని  తెలిపారు.  బహిరంగ ప్రదేశాలలో మాస్కులు ధరించని వారికి  జరిమానాలు విధించాలని  ఆదేశించారు.  జిల్లా స్థాయిలో కరోనా వైద్యానికి చికిత్స అందించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని, కేసులు అధికంగా వస్తే  ఆసుపత్రి స్థాయిలో చికిత్స అందించేందుకు వీలుగా  ఆసుపత్రులను  సిద్దం చేయాలని, కొవిడ్ కోసం ప్రత్యేకంగా బెడ్లు, వార్డులను  సిద్దం  చేసుకోవాలని ఆదేశించారు.   కరోనా కేసులు అధికంగా వస్తున్న  ప్రాంతాలో వ్యాదినిర్దారణ పరీక్షలను  పెంచాలని,  ట్రెసింగ్ పకడ్భందిగా నిర్వహించాలని ఆదేశించారు. సమావేశంలో  పాల్గోన్న  జిల్లా కలెక్టర్ జి. రవి  మాట్లాడుతూ  జగిత్యాల జిల్లా  పరిధిలో  కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ నిర్దేశిత లక్ష్యాల మేరకు  పూర్తి చేస్తున్నామని, ప్రస్తుతం ప్రతి రోజు 1400  మందికి  వ్యాక్సినేషన్ అందిస్తున్నామని, వైరస్ వ్యాప్తిని బట్టి అదనంగా మరిన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. కరోనా పరీక్షలు సైతం అధికంగా తీసుకునేలా చర్యలు తీసుకుంటామని, ఆసుపత్రి స్థాయిలో చికిత్స అందించేందుకు అవసరమైన ఏర్పాట్లను  సిద్దం చేసుకుంటున్నామని,  కోవిడ్ కేర్ సెంటర్లు  ఏర్పాటు  చేస్తున్నామని పేర్కోన్నారు.ప్రస్తుతం 100  బెడ్లతో  చికిత్స అందించేందుకు సిద్దంగా ఉన్నామని, వాటిలో 50 బెడ్లకు ఆక్సిజన్ సౌకర్యం ఉందని, 15 ఐసియూ బెడ్లు ఏర్పాటు చేసామని తెలియజేశారు. జిల్లాలో  ఈ రోజు 175 నూతన కేసులు వచ్చాయని, వీరందరని   హోం క్వారంటైన్ లో ఉంచామని తెలిపారు. జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 11637  మందికి  కరోనా వైరస్ నిర్థారించగా, 10897  మంది  కోలుకున్నారని, 56 మంది  మరణించారని, 684  యాక్టివ్ కేసులు ఉన్నాయని తెలిపారు.   ప్రస్తుతం   హోం క్వారంటైన్ లో 675 మంది,  ఆసుపత్రిలో 9 మందికి వైద్య చికిత్స అందిస్తున్నామని తెలిపారు. జిల్లా అదనపు కలెక్టర్ అరుణశ్రీ ,జిల్లా వైద్యారొగ్య శాఖ అధికారి పుప్పాల శ్రీధర్ ,  సంబంధిత అధికారులు తదితరులు  ఈ వీడియో  కాన్పరెన్సులో పాల్గోన్నారు.

Related Posts