YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

జగన్‌ బెయిల్‌‌ను రద్దు చేయాలి హైకోర్టులో వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు పిటిషన్‌

జగన్‌ బెయిల్‌‌ను రద్దు చేయాలి  హైకోర్టులో వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు పిటిషన్‌

న్యూఢిల్లీ ఏప్రిల్ 6
 సీబీఐ కోర్టులో ఏ-1గా ఉన్న ఏపీ సీఎం జగన్‌ బెయిల్‌‌ను రద్దు చేయాలని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. జగన్మోహన్‌రెడ్డి 11 సీబీఐ ఛార్జిషీట్లలో ఏ-1గా ఉన్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసిన వ్యక్తిగా.. తమ పార్టీకి చెడ్డ పేరు రాకుండా చూడాలన్న ఉద్దేశంతోనే పిటిషన్ వేసినట్టు తెలిపారు. ఢిల్లీలో తన నివాసంలో మీడియాతో మంగళవారం మాట్లాడిన ఆయన.. ఇన్ని ఛార్జిషీట్లు వేసినా... ట్రయల్ ఆలస్యంగా జరుగుతోందన్నారు. కేసుల విచారణలో జాప్యం జరుగుతోంని, ఆయన త్వరగా కేసుల నుంచి బటయపడాలనే ఈ కేసు వేశానన్నారు. త్వరగా కేసు తేలిపోతుందని నమ్ముతున్నానని తెలిపారు. ప్రత్యర్థులు నానా రకాలుగా మాట్లాడటం బాధాకరమని, వారికి ఆ ఛాన్స్ ఇవ్వకూడదనే ఉద్దేశంతోనే హైకోర్టు తలుపుతట్టానన్నారు. కోర్టుకు వెళ్లకపోవడం... అనుమానించే విధంగా ఉన్నాయన్నారు. ప్రజాస్వామ్యాన్ని, పార్టీని రక్షించుకోవాలని, జయలలిత, లాలూ తదితరులు తమ స్థానంలో వేరే వారికి సీఎంగా ఛాన్స్ ఇచ్చినట్టే జగన్ కూడా వేరొకరికి అవకాశమిచ్చి.. కేసుల నుంచి బయటపడాలన్నారు.

Related Posts