YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

ఓటర్ల జాబితా నుంచి శశికళ పేరు తొలగింపు

ఓటర్ల జాబితా నుంచి శశికళ పేరు తొలగింపు

చెన్నై ఏప్రిల్ 6
 ఓటర్ల జాబితా నుంచి దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు శశికళ పేరును తొలగించినట్టు థౌజెండ్‌లైట్స్‌ అమ్మామక్కల్‌ మున్నేట్ర కళగం అభ్యర్థి వైద్యనాథన్‌ తెలిపారు. పోయెస్‌గార్డెన్‌లో వేదనిలయంలో జయలలితతోపాటు వీకే శశికళ 30 యేళ్ళకు పైగా నివసించారు. ప్రతి ఎన్నికలలోనూ ఇరువురూ పోలింగ్‌ కేంద్రానికి వెళ్ళి ఓటు వేసేవారు. ప్రస్తుతం వేదనిలయాన్ని స్మారకమందిరంగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆ నివాసగృహాన్ని స్వాధీనం చేసుకుంది. ఈ కారణంగా ఆ చిరునామాలో నివసించిన శశికళ పేరును ప్రస్తుతం ఓటర్ల జాబితా నుంచి తొలగించారు. ఈ విషయమై వైద్యనాథన్‌ మాట్లాడుతూ.. వేదనిలయాన్ని స్మారక మందిరంగా మార్చటాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు విచారణ పెండింగ్‌లో ఉందని, అలాంటప్పుడు శశికళ పేరును, వేదనిలయంలో నివసిస్తున్న వారి పేర్లను ఎలా తొలగించారని ప్రశ్నించారు. ఓటర్ల జాబితా నుంచి శశికళ పేరును తొలగించడం చట్టానికి వ్యతిరేకమని తెలిపారు. ఈ విషయంపై శశికళ తరఫు న్యాయవాది థౌజెండ్‌లైట్స్‌ నియోజకవర్గం ఎన్నికల అధికారిని కలుసుకుని ఫిర్యాదు చేయనున్నారని చెప్పారు.

Related Posts