YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం తెలంగాణ

 హుస్సేన్ సాగర్ ప్రక్షాళన అడుగులు

 హుస్సేన్ సాగర్ ప్రక్షాళన అడుగులు

హుస్సేన్ సాగర్ ప్రక్షాళన అడుగులు
హైదరాబాద్, ఏప్రిల్ 7,
హుస్సేన్‌సాగర్‌ నుంచి వెలువుడే దుర్వాసనను అదుపుచేయడానికి హెచ్‌ఎండీఏ కసరత్తు చేస్తోంది. వేసవి సమీపిస్తుండటంతో ముందుగానే మేల్కొన్న అధికారులు దుర్వాసనను అరికట్టేందుకు చర్యలు చేపట్టారు. ఇందుకోసం అంతర్జాతీయంగా అనుసరిస్తున్న బయో రెమిడేషన్‌ సహా ఇతర ఆధునిక పద్ధతులను అనుసరించబోతున్నారు. జాతీయ, అంతర్జాతీయ సంస్థలను భాగస్వామ్యం చేసి వాసనలను అదుపుచేయబోతున్నారు. ఇందుకోసం అనుసరించాల్సిన మార్గాలపై హెచ్‌ఎండీఏ అధికారులు పలు శాఖల అధికారులతో చర్చలు జరిపారు. కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ), ఎన్విరాన్‌మెంటల్‌ ప్రొటెక్షన్‌ ట్రైనింగ్‌ అండ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఈపీటీఆర్‌ఐ)లకు చెందిన నిపుణులతో హెచ్‌ఎండీఏ అధికారులు చర్చలు జరుపుతున్నారు. గ్లోబల్‌ టెండర్లను ఆహ్వానించి అంతర్జాతీయ కన్సల్‌టెంట్ల భాగస్వామ్యంతో వాసనలు రాకుండా చర్యలు చేపట్టబోతున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.ఎండాకాలం వచ్చిందటే హుస్సేన్‌సాగర్‌ నుంచి కుల్లిన కోడిగుడ్డు వాసనలు వస్తుంటాయి. కిలోమీటర్‌ వ్యవధిలో ఈ దుర్వాసన వ్యాపించి పర్యాటకులను ఇబ్బందిపెడుతుంటాయి. సాగర జలాలు కొంత వరకు కాలుష్యపూరితమైనవి కావడంతో ఈ జలాల్లో ఎనరోబిక్‌ బ్యాక్టీరియా పెరుగుతుంది. కాలుష్యం పెరిగిన కాణంగా నీటిలో ఉండే ‘జీవ ఆక్సిజన్‌ డిమాండ్‌’ (బీవోడీ) గణనీయంగా పడిపోతుంది. లీటర్‌ వ్యర్థజలాల్లో సాధారణంగా 6 -7 మిల్లీగ్రాముల బీవోడీ ఉండాలి. కానీ ప్రస్తుతం సాగర్‌లో 4-5 మాత్రమే ఉంటోంది. పైగా.. ఎండతీవ్రత కారణంగా ఉష్ణోగ్రతలు అంతకంతకు పెరిగితే సాగర్‌లోని నీటిమట్టం క్రమంగా తగ్గుతుంది. నీటిమట్టం తగ్గిన కొద్ది నీటిలో ఉండే ఆక్సిజన్‌ శాతం మరింత తగ్గిపోతోంది.దీంతో ఈ నీటిలో ఎనరోబిక్‌ బ్యాక్టీరియా ఉత్పత్తి గణనీయంగా పెరుగుతుంది. సాధారణంగా వేలల్లో ఈ ఎనరోబిక్‌ బ్యాక్టీరియా ఉంటే.. అది గంటల వ్యవధిలోనే లక్షల్లోకి చేరుతుందని పీసీబీ సైంటిస్ట్‌లు తెలిపారు. ఈ బ్యాక్టీరియా ఆక్సిజన్‌కు బదులుగా కాలుష్య, రసాయన వ్యర్థజలాల్లో ఉండే సల్ఫేట్‌ మాలిక్యూల్స్‌ను తీసుకుంటుంది. సల్ఫేట్‌ను తీసుకున్న బ్యాక్టీరియా హెచ్‌2ఎస్‌ గ్యాస్‌ను బయటికు వదులుతుంది. ఈ గ్యాస్‌ కుళ్లిన కోడిగుడ్డు వాసనకు కారణమని పీసీబీ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. బ్యాక్టీరియాను వినియోగించి బయోరెమిడేషన్‌ పద్ధతి సహా మరిన్ని అధునిక పద్ధతులతో కుళ్లిన కోడిగుడ్ల వాసనను అరికట్టేందుకు హెచ్‌ఎండీ అధికారులు చర్యలు

Related Posts