కొండెక్కిన చికెన్ ధర
వరంగల్, ఏప్రిల్ 7
పండుగలకు పబ్బాలకు, ఆదివారం వస్తే అలవాటుగా చాలా మం ది నాన్ వెజ్ తిందామనుకుంటారు. కానీ ధరలు పెర గడంతో సామాన్య ప్రజలు చికెన్ తినాలంటేనే భయ పడుతున్నారు. గడిచిన ఆరు నెలల్లో ఎన్నడూ లేని విధంగా కిలో చికెన్ ధర ఒక్కసారిగా రూ.259కి పెరి గింది. పదిరోజుల క్రితం కిలో రూ.190 ఉన్న ధర ఒక్కసారిగా రూ.70 పెరిగి ఇప్పుడు 259కు చేరింది. పోని గుడ్డుతోనైనా సరిపెట్టుకుందామంటే అది కూడా రూ.5కు చేరింది. దీంతో కొండెక్కిన చికెన్ ధరలు మాంసం ప్రియులకు చుక్కలు చూపి స్తున్నాయి.దీనికి తోడు కూరగాయలు, పప్పుల ధరలు కూడా పెరగడంతో ఏం తినేటట్టు లేద ని ప్రజలు వాపోతున్నారు. కొవిడ్ వైర స్, బర్డ్‌ఫ్లూ ప్రభావంతో చికెన్ వినియో గం కొంతకాలంగా 50-60 శాతం వర కు పడిపోయి ఒక దశలో కిలో వందకే లభించింది. వినియోగం పెరగడం, ఎండలు మండిపోతుండడంతో కోళ్ల దిగుమతి తగ్గిపోయిందని అందుకే ధర పెరుగుతోందని వ్యాపారులు చెబుతు న్నారు.వడగాలుల తీవ్రతకు పౌల్ట్రీ ఫాముల్లో కోళ్లు చని పోవడం, ఎండల తీవ్రత పెరగడం వల్ల చికెన్ ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని పౌల్ట్రీయజమానులు అంటున్నారు. పెళ్లిళ్ల సీజన్ రానుండడంతో కిలో చికెన్ ధర 300 వరకు వెళ్లే అవకాశాలున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు.ఇలా అయితే చికెన్ తినడం కష్టమే అని సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.కొవిడ్, బర్డ్ ప్లూ ప్రచారంతో పౌల్ట్రీ యజమానులు చాలా వరకు కోళ్ల ఉత్పత్తిని నిలిపివేశారని, అందువల్లే ఇప్పుడు డిమాండ్‌కు తగ్గ సరఫరా చేయలేకపోతున్నా మని పౌల్ట్రీయజమానులు చెబుతున్నారు. డిమాండ్ అధికంగా ఉండటంతోనే ధరలు పెరుగుతున్నాయని ఈనెలాఖరు వరకు ఇదే పరిస్థితి ఉంటుందని కోళ్ల దా ణా ధరలు, నిర్వహణ వ్యయం పెరగడంతో పాటు వ డగాలుల తీవ్రతకు పౌల్ట్రీల్లో కోళ్లు చనిపోవండంతో చికెన్ ధరలు మున్ముందు మరింత పెరిగే అవకాశ ముంటుందని వ్యాపారులు చెబుతున్నారు.రేట్లు పెరగడంతో జనాలు చికెన్ కొనడానికి ఆసక్తి చూ పడంలేదు. చికెన్ ధరకు 100 కలిపితే ఆఫ్ కేజీ మట న్ వస్తుందని అంటున్నారు. గతంలో వారానికి 20 క్విం టాళ్ల చికెన్ వ్యాపారం జరిగే ది. రేట్లు పెరగడంతో 10క్వింటాళ్లు కూడాఅమ్మడం లేదు. రేట్లు పెరగడంతో వ్యాపారం చాలా తగ్గిపో యింది.