YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం దేశీయం

సుగుణాలే రాముడిని ఆదర్శ పురుషుడిగా...

సుగుణాలే రాముడిని ఆదర్శ పురుషుడిగా...

సుగుణాలే రాముడిని ఆదర్శ పురుషుడిగా...
తండ్రిమాటను జవదాటని తనయుడిగా, సోదరులను అభిమానించిన అన్నగా, భార్య దూరమైన నిరంతరం అమె కోసం పరితపించే భర్తగా, ప్రజల సంక్షేమం కోసమే వారి మాటకు విలువిచ్చిన రాజుగా ఎక్కడా ధర్మం తప్పకుండా మనిషి అనేవాడు ఇలా జీవించాలని చూపించినవాడు శ్రీరాముడు. ధర్మానికి ప్రతీక శ్రీరామచంద్రుడు. త్రేతాయుగంలో శ్రీమహావిష్ణువే లోక కల్యాణం కోసం రాముడిగా అవతరించి, దుష్ట శిక్షణ చేశాడని రామాయణం తెలుపుతుంది. తండ్రి ఇచ్చిన మాట కోసం కట్టుబడి అరణ్యాలకు వెళ్లిన రాముడు ఇప్పటికీ ఎప్పటికీ ఆదర్శ మూర్తే. రామాయణంలో రాముడి లక్షణాలు గురించి వర్ణిస్తూ షోడశ మహా గుణాలు ఆయనలో ఉన్నట్లు తెలిపారు. అయితే రాముడితోపాటు సీత, లక్ష్మణుడు, హనుమంతుడు కూడా కొన్ని ధర్మాలకు ప్రతీకలుగా నిలిచారు.
ఒక వ్యక్తిగా, రాజుగా, తనయుడిగా, అన్నగా, భర్తగా, తండ్రిగా... ఇలా ఎక్కడా ధర్మము తప్పకుండా మనిషి అనేవాడు ఇలా జీవించాలి అని చూపించినవాడు శ్రీరాముడు. 16 గుణములు పుష్కలంగా కలిగి ఉన్నవాడు రాముడు. మానవ ధర్మానికి ప్రతీక శ్రీరామచంద్రుడు. సీతాదేవి పతివ్రతా ధర్మానికి ప్రతీక. లక్ష్మణుడు భాతృధర్మానికి ప్రతీక అయితే హనుమంతుడు భక్తికి ప్రతీక. 
రామునిలో ఉన్న 16 గుణాలు ఏవంటే...
1. గుణవంతుడు, 2. వీర్యవంతుడు, 3. ధర్మాత్ముడు, 4. కృతజ్ఞతాభావం కలిగినవాడు, 5. సత్యం పలికేవాడు, 6. దృఢమైన సంకల్పం కలిగినవాడు, 7. చారిత్రము కలిగినవాడు, 8. అన్ని ప్రాణుల మంచి కోరేవాడు, 9. విద్యావంతుడు, 10. సమర్థుడు, 11.ఎన్నిసార్లు చూసినా ఇంకా చూడాలనిపించేంతటి సౌందర్యము కలిగినవాడు, 12. ధైర్యవంతుడు, 13. క్రోధాన్ని జయించినవాడు, 14. తేజస్సు కలిగినవాడు, 15.ఎదుటివారిలో మంచిని చూసేవాడు. 16. అవసరమైనప్పుడు కోపాన్ని తెచ్చుకోగలిగినవాడు.
ఈ సుగుణాలే రాముడిని ఆదర్శ పురుషుడిగా....
సీతాదేవి పతివ్రతా ధర్మానికి ప్రతీక... లక్ష్మణుడు భాతృధర్మానికి ప్రతీక.....హనుమంతుడు భక్తికి ప్రతీక. తన అంచంచలమైన భక్తితో హనుమంతుడు నేటికీ చిరంజీవిగా ఉన్నాడు. స్వామి భక్తి పరాయణుడైన వాయు నందనుడు నిరంతరం రామ నామ స్మరణతోనే గడిపాడు. ఇక లక్ష్మణుడు అన్నావదినల సేవ కోసం పద్నాలుగేళ్లు నిద్ర లేకుండా ఉండేలా వరం పొందాడు. తన నిద్రను భార్య ఊర్మిళకు అనుగ్రహించడంతో లక్ష్మణుడు అయోధ్యకు తిరిగి వచ్చే వరకు ఆమె మేల్కోలేదు. రావణుడు అపహరించడానికి ప్రయత్నిస్తే ఆత్మత్యాగానికి సిద్ధపడింది. అయితే అగ్నిదేవుడు ఆమెను రక్షించి, మాయ సీతను రావణుడు తీసుకుపోయోలా చేశాడు.
శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ||
 

Related Posts