టిటిడి లో అన్యమతస్తులున్నారు…
నాతో రండి…. చూపిస్తా
రండి: రమణ దీక్షితులు కు బీజేపీ నేత భానుప్రకాష్ సవాల్
తిరుపతి ఏప్రిల్ 7,
తిరుమల తిరుపతి లో అన్యమత స్తులు లేరంటు అర్చకులు రమణ దీక్షితులు చేసిన వ్యాఖ్యలను బీజేపీ ప్రధాన కార్యదర్శి, టీటీడీ మాజీ ట్రస్టీ. భాను ప్రకాష్ రెడ్డి ఖండించారు. టీటీడీలో ఇంకా అన్యమతస్థులున్నారని తనతో వస్తే చేపిస్తానని ఛాలెంజ్ విసిరారు.
బుధవారం తిరుపతి లో జరిగిన ప్రెస్ మీట్ లో భాను ప్రకాష్ మాట్లాడుతూ ప్రతి శనివారం స్వామికి ఇచ్చె హారతిని చాలా మంది సిబ్బంది తీసుకోవాలని ప్రతి ఆదివారం చర్చిలకు వెళ్ళే టిటిడి ఉద్యోగులను వందల సంఖ్యలో చూపిస్తానని అన్నారు. రమణ దీక్షితులు తన స్వార్ధ పూరిత వ్యవహారం కోసం తిరుమలస్వామి ని సైతం రోడ్ పైకి ఈడ్చారాని అయన ఆరోపించారు. దీక్షితులాంటివాళ్లు స్వామి కి మాత్రమే సేవకులుగా ఉండాలి. కావాలంటే వీళ్లు రాజకీయ నాయకులకు అనుచరులుగా వెళ్ళవచ్చని అన్నారు. రమణదీక్షితుల మాటలు తిరుమల పవిత్రతకు భంగం కలిగిస్తున్నాయి. రమణ దీక్షితులు తన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పేకే ఆలయంలో అడుగుపెట్టాలి. రాష్ట్రంలో హిందువుల విశ్వాసాలను కాలరాసే కుట్రలు చేస్తున్నారని అయన మండిపడ్డారు.