YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

కీలక వడ్డీ రేట్లు రెపో రేటు రివర్స్ రెపో రేటు యధాతథం

కీలక వడ్డీ రేట్లు రెపో రేటు రివర్స్ రెపో రేటు యధాతథం

కీలక వడ్డీ రేట్లు రెపో రేటు రివర్స్ రెపో రేటు యధాతథం
ఆర్బిఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ నిర్ణయం
ఇక లోన్ పొందే వారికి బెనిఫిట్
న్యూ ఢిల్లీ ఏప్రిల్ 7
రిజర్వ్ బ్యాంక్ ఆప్ ఇండియా ద్రవ్య పరపతి విధాన కమిటీ సమావేశం అయ్యింది. మూడు రోజుల సమావేశాలు సోమవారం నుంచి  జరిగాయి. కోవిడ్ సెకండ్ వేవ్ దేశ ఆర్థిక పరిస్థితిపై ఎలాంటి ప్రభావం చూపనుంది ద్రవ్యోల్బణ కట్టడికి ఏ తరహా చర్యలు తీసుకోవాలి తదితర అంశాలపై ఈ సమావేశంలో ప్రధానంగా కమిటీ వివిధ అంశాలపై చర్చించింది.   ఈ సందర్భంగా ఆర్బీఐ కమిటీ తీసుకున్న నిర్ణయాల గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. కీలక వడ్డీ రేట్లు రెపో రేటు రివర్స్ రెపో రేటును యధాతథంగా కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.ఆర్థిక నిపుణులు అంచనా వేసినట్లుగా రెపో రేటును తగ్గించలేదని తెలిపారు. రెపో రేటును 4 శాతం వద్ద రివర్స్ రెపో రేటును 3.35 శాతం వద్ద యథాతథంగా ఉంచినట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ వెల్లడించారు.   రెపో రేటు విషయంలో యధాతథ స్థితిని కొనసాగించడం వరుసగా ఇది ఐదోసారి. దేశ ఆర్థిక కార్యకలాపాలు సహజస్థితికి చేరుకుంటున్నట్లు ఆర్బీఐ గవర్నర్ తెలిపారు. కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఇబ్బందికర పరిస్థితుల్లో ఉందన్నారు ఆర్బీఐ గవర్నర్. అయితే ఫైనాన్షియల్ మార్కెట్లు పుంజుకుంటున్నట్లు ఆయన తెలిపారు. 2021లో భారత్ 12.5 శాతం వృద్ధిరేటును నమోదుచేసుకునే అవకాశముందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ  అంచనావేయడం తెలిసిందే. చైనాకంటే ఎక్కువగా భారత్ వృద్ధిరేటును సాధించే అవకాశముందని అంచనావేసింది. కరోనా కారణంగా నెలకొన్న ఆర్థిక కష్టాలను భారత్ అత్యంత వేగంగా అధిగమిస్తున్నట్లు ఐఎంఎఫ్ అంచనావేసింది. ఇకపోతే ఆర్ బీఐ నిర్ణయం వల్ల రుణ గ్రహీతలకు బెనిఫిట్ కలునుంది. లోన్ తీసుకోవాలని భావించే వారికి మరి కొంత కాలం తక్కువ వడ్డీకే రుణాలు అందుబాటులో ఉండనున్నాయి. దీని వల్ల రుణ గ్రహీతలపై తక్కువ భారం పడుతుంది. ఆర్ బీఐ నిర్ణయం వల్ల లోన్ పొందే వారికి బెనిఫిట్ కలుగనుంది.

Related Posts