ఎన్టీఆర్ బయోపిక్ కు ఎవరు డైరక్ట్ చేస్తారని...ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. డైరెక్టర్ గా రాఘవేంద్ర రావు, క్రిష్, వైవిఎస్ పేర్లు వినవస్తున్నాయి. అయితే బాలయ్య తో సినిమా అంటే మాటలు కాదు...ఎవరికి వారు ఓ అడుగు వెనక్కి తగ్గుతంటూరు. మూవీని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పాటు..ఏ లోపం జరిగినా...మాట పడాల్సి వస్తుందోమోనన్న భయంతో... బయోపిక్ అంటే భయపడుతున్నాయి. మరి రేపటిలోగా ఈ రేసులో మరెన్ని పేర్లు వస్తాయో అనేది వేచి చూడాల్సి ఉంది.బాలకృష్ణ తన తండ్రి బయోపిక్ ని ఎటువంటి కాంట్రవర్సీ లేకుండా తెరకేక్కిన్చాలని అనుకుంటే ఆదిలోనే హంసపాదులా ఈ చిత్రానికి డైరెక్షన్ చేస్తున్న తేజ హఠాత్తుగా తప్పుకున్నాడు. రెండ్రోజులపాటు షూటింగ్ కూడా చేసిన తేజ తాను ఎన్టీఆర్ వంటి మహోన్నత వ్యక్తి జీవిత కథని తెరకెక్కించలేనని… అందుకే తాను తప్పుకుంటున్నట్టుగా ఒక ట్వీట్ చేసి అందరిని ఆశ్చర్యానికి, షాక్ లోకి నెట్టేశాడు. మరి ప్రస్తుతానికి ఎన్టీఆర్ బయో పిక్ పై మళ్ళీ ఎడతెగని చర్చ మొదలైపోయింది. తేజ మాత్రం కె రాఘవేంద్ర రావు ఎన్టీఆర్ బయోపిక్ డైరెక్ట్ చేసే ఛాన్స్ ఉందన్నాడు.ఇప్పుడు ఎన్టీఆర్ బయోపిక్ డైరెక్టర్ రేసులో కి గౌతమీపుత్ర డైరెక్టర్ క్రిష్, ఒక్కమగాడు డైరెక్టర్ వైవిఎస్ చౌదరి పేర్లు వినబడుతున్నాయి. అయితే బాలకృష్ణ డెసిషన్ ఎలా ఉందొ తెలియదు గాని.. ప్రస్తుతానికి ఎన్టీఆర్ బయోపిక్ దర్శకుడి రేసులో జాగర్లమూడి క్రిష్ పేరు మాత్రం గట్టిగా వినబడుతుంది. ఎందుకంటే బాలకృష్ణ కూడా క్రిష్ వైపే మొగ్గుచూపే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. బాలకృష్ణకి గౌతమీపుత్ర శాతకర్ణి వంటి హిట్ ని క్రిష్ అందించాడు. అందుకే బాలయ్య క్రిష్ చేతిలో ఈ ఎన్టీఆర్ బయోపిక్ బాధ్యత పెట్టె అవకాశాలు ఉన్నాయంటున్నారు.మరి కె రాఘవేంద్ర రావు ని కూడా బాలయ్య ఇప్పటికే సంప్రదించగా.. ఆయన మాత్రం ఆలోచించుకోవడానికి తనకి సమయం కావాలని అడిగినట్లుగా వార్తలోస్తున్నాయి. ఇక రాఘవేంద్ర రావు గనక ఒప్పుకోకపోతే.. ఆ ఛాన్స్ మాత్రం క్రిష్ కి వచ్చే అవకాశం ఉంది. మరోపక్క ఎన్టీఆర్ కి వీరాభిమాని అయిన వైసీఎస్ చౌదరి పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. మరి వైవిఎస్ బాలకృష్ణ కి ఒక్కమగాడు సినిమా వంటి భారీ ప్లాప్ ఇచ్చాడు. మరి ఇంతటి పెద్ద బాధ్యతని వైవిఎస్ నెరవేరుస్తాడా అనేది కూడా ఆలోచిస్తునట్లుగా చెబుతున్నారు. ప్రస్తుతానికి ఎన్టీఆర్ బయోపిక్ డైరెక్టర్ గా రాఘవేంద్ర రావు, క్రిష్, వైవిఎస్ పేర్లు వినవస్తున్నాయి. మరి రేపటిలోగా ఈ రేసులో మరెన్ని పేర్లు వస్తాయో అనేది వేచి చూడాల్సి ఉంది.