YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

శృతి హాసన్ పై క్రిమినల్ కేసు

శృతి హాసన్ పై క్రిమినల్ కేసు

చెన్నై, ఏప్రిల్ 7, 
తమిళనాడు ఎన్నికల వేళ సిత్రాలు చోటుచేసుకున్నాయి. ఎన్నికల బరిలో నిలిచిన మక్కల్ నీది మయం(ఎంఎన్‌ఎం) పార్టీ అధినేత, ప్రముఖ సినీ నటుడు కమల్ హాసన్ కుమార్తె, హీరోయిన్ శ్రుతీ హాసన్‌పై బీజేపీ ఫైర్ అయింది. పోలింగ్ కేంద్రాన్ని శ్రుతీ హాసన్ అక్రమంగా సందర్శించారని ఎన్నికల సంఘానికి కమలం పార్టీ ఫిర్యాదు చేసింది. తన తండ్రి, ఎంఎన్‌ఎం చీఫ్ కమల్ పోటీ చేస్తున్న కోయంబత్తూరు సౌత్ నియోజకవర్గ పరిధిలోని ఓ బూత్‌లోకి ఆమె ప్రవేశించారు. తండ్రి కమల్‌తో కలసి శ్రుతి పోలింగ్ బూత్‌లోకి వెళ్లడంపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది.కేవలం బూత్ ఏజెంట్లకు మాత్రమే లోపలికి వెళ్లేందుకు అనుమతి ఉంటుందని.. కనీసం నిబంధనలు పాటించకుండా ఆమె తన తండ్రితో కలసి అక్రమంగా బూత్‌ను సందర్శించారని బీజేపీ ఈసీకి ఫిర్యాదు చేసింది. ఆమెపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని కోరింది. కోయంబత్తూరు సౌత్ బీజేపీ అభ్యర్థి, కమల్ ప్రత్యర్థి అయిన వసతి శ్రీనివాసన్ తరఫున ఆ పార్టీ నేత నందకుమార్ ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. నిన్న తమిళనాడు ఎన్నికల పోలింగ్ సందర్భంగా కమల్ హాసన్, ఆయన కూతుళ్లు శ్రుతీ, అక్షర హాసన్‌లతో కలసి చెన్నైలో ఓటు వేశారు. అనంతరం తాను పోటీ చేస్తున్న కోయంబత్తూరు సౌత్ నియోజకవర్గానికి శ్రుతీతో కలసి వెళ్లారు. నియోజవర్గంలోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఆ సమయంలో తండ్రితో పాటు కూతురు శ్రుతీ హాసన్ కూడా పోలింగ్ కేంద్రంలోకి వెళ్లడంపై బీజేపీ గరంగరమైంది.

Related Posts