YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

లాక్ డౌన్ అడుగులు

లాక్ డౌన్ అడుగులు

ముంబై, ఏప్రిల్ 8, 
దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుంది. భారత్ లో సెకండ్ వేవ్ ప్రారంభమయినట్లు వైద్య శాఖ చెబుతోంది. గత ఏడాది మార్చి నెల కంటే మించిన కేసులు నమోదవుతుండటం ఆందోళన కల్గిస్తుంది. రోజుకు 45 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. మరణాల సంఖ్య కూడా పెరుగుతుండటం కరోనా తీవ్రతకు అద్దంపడుతుంది. ఇప్పటికే భారత్ లో కోటి ముప్ఫయి లక్షల మంది కరోనా బాధితులు చేరిపోయారు. మరణాల సంఖ్య కూడా దాదాపు రెండు లక్షలకు చేరువలో ఉంది.నిజానికి ఊహించిందే. అనేక దేశాల్లో కరోనా సెకండ్ వేవ్ స్టార్ట్ అయింది. యూరప్ దేశాల్లో కరోనా సెకండ్ వేవ్ స్టార్ట్ అవ్వడంతో అక్కడ కొన్నిచోట్ల లాక్ డౌన్ ను కూడా విధించారు. అయితే భారత్ లో సెకండ్ వేవ్ స్టార్టవ్వడానికి అనేక రకాలు కారణాలు విన్పిస్తున్నాయి. అనేక రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు కూడా కరోనా వ్యాప్తికి కారణాలుగా వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.మరోవైపు కరోనా వ్యాక్సిన్ రావడంతో ప్రజల్లో భయం పోయింది. గతంలో మాదిరి శానిటైజర్ లను వాడటం లేదు. గత మార్చితో పోలిస్తే శానిటైజర్ల వినియోగం పదిశాతం కూడా లేదని గణాంకాలు చెబుతున్నాయి. ఇక భౌతిక దూరాన్ని కూడా పాటించకపోవడం మాస్క్ లను ధరించకపోవడం కూడా కరోనా వ్యాప్తికి కారణాలంటున్నారు. ఈనేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమై ఏప్రిల్ 30 వరకు కోవిడ్ నిబంధలను అమలు చేయాలని రాష్ట్రాలను ఆదేశించింది.ఇదే పద్ధతిలో కరోనా వ్యాప్తి కొనసాగితే లాక్ డౌన్ మరోసారి తప్పదని వైద్యులు చెబుతున్నారు. అయితే గతంలో కంటే రికవరీ శాతం కొంత మెరుగుపడటం ఊరటనిచ్చే అంశం. అంతేకాకుండా ఆసుపత్రుల్లో ట్రీట్ మెంట్ కూడా మెరుగైంది. పడకల సంఖ్య కూడా బాగా పెంచేశాయి. దీంతో కరోనా వ్యాప్తి చెందినా మరణాల సంఖ్యను నియంత్రించవచ్చని వైద్యులు చెబుతున్నారు. అయితే పాక్షికంగానైనా లాక్ డౌన్ విధిస్తే మేలని నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు ఆ దిశగా అడుగులు వేస్తున్నాయి.రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమల్లో ఉంటుందని పంజాబ్ ప్రభుత్వం పేర్కొంది. ఈ సమయాల్లో అత్యవసర సేవల కోసం మాత్రమే అనుమతి ఇస్తామని తెలిపారు. నైట్ కర్ఫ్యూతో పాటు విద్యాసంస్థలు కూడా మూసివేసే ఉంటాయని వెల్లడించారు. ఏప్రిల్ 30 వరకు నిబంధనలు అమల్లో ఉంటాయని స్పష్టం చేశారు. రాజకీయ, ఇతర ఎలాంటి సమావేశాలు నిర్వహించరాదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులందరూ విధిగా మాస్క్ ధరించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. పంజాబ్‌లో కరోనా పరిస్థితిపై ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ బుధవారం అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.కొన్ని రోజులుగా పంజాబ్‌లో రోజూవారి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరిగింది. ఇక్కడ వైరస్ వ్యాప్తికి 80 శాతం యూకే వేరియంట్ కారణం అవుతోంది. మరణాల సంఖ్య పెరిగింది. ఒక్క రోజే పంజాబ్‌లో 2924 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొవిడ్ బారినపడి గడిచిన 24 గంటల్లో పంజాబ్‌లో 62 మంది మరణించారు. దీంతో పంజాబ్‌లో మొత్తం కొవిడ్ మరణాల సంఖ్య 7,216కు చేరుకుంది. మొత్తం కేసుల సంఖ్య 2,57,057కు ఎగబాకింది. ప్రస్తుతం రాష్ట్రంలో 25,913 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Related Posts