YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి

విద్యావకాశాలను పరిశీలించిన నేపాల్ బృందం

విద్యావకాశాలను పరిశీలించిన నేపాల్ బృందం

తెలంగాణలోని వివిధ పాఠశాలల్లో అందుతున్న విద్యావకాశాలను నేపాల్ ప్రతినిధుల బృందం పరిశీలించింది. నేపాల్ ప్రతినిధుల బృందం తెలంగాణ పర్యటనకు విచ్చేసిన విషయం తెలిసిందే. పర్యటనలో భాగంగా మండలి ఛైర్మన్‌తో భేటీ అయ్యారు. ఈసందర్భంగా మండలి చీఫ్ విప్ పాతూరి సుధాకర్‌రెడ్డి విద్యాభివృద్ధికి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ప్రతినిధి బృందానికి వివరించారు. గత మూడేళ్లలో తెలంగాణలో గణనీయమైన విద్యాభివృద్ధి చోటుచేసుకుందన్నారు. మూడున్నరేళ్లలో 500 రెసిడెన్షియల్ స్కూళ్లు ప్రారంభించి దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్‌గా నిలిచిందని తెలిపారు. రెసిడెన్షియల్ స్కూలులో ఒక్కో విద్యార్థిపై ప్రభుత్వం రూ. 1.25 లక్షలు వెచ్చిస్తోందని వెల్లడించారు. బాలకార్మిక వ్యవస్థ రూపు మాపేందుకు, బాల్య వివాహాలు అరికట్టేందుకు తెలంగాణ ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. సీఎం కేసీఆర్ తెలంగాణలో అభివృద్ధిని ఉరకలెత్తిస్తున్నారని టాస్క్‌మాస్టర్‌గా కేసీఆర్‌ను అందరూ ప్రశంసిస్తున్నట్లు తెలిపారు. నేపాల్, తెలంగాణ మధ్య విద్యతో పాటు అన్ని రంగాల్లో సహాయసహకారాలు పెరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. నేపాల్‌కు కూడా తెలంగాణ నుంచి అధ్యయన బృందాలను పంపుతామని పేర్కొన్నారు.

Related Posts