నెల్లూరు
నెల్లూరు జిల్లా ఎఎస్ పేట మండలం పొనుగోడు గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. బ్యాలెట్ బాక్సు ను నీటి తొట్టెలో వేయడంతో ఇక్కడ పోలింగ్ నిలిచిపోయింది. పోలింగ్ జరుగుతుండగా వృద్ధుల ఓట్లు పోల్ చేసే విషయంలో వివాదం చోటుచేసుకుంది అది తీవ్ర గాలివానగా మారి బ్యాలెట్ బాక్సులు తీసుకువెళ్లి బిజెపి మద్దతు దారుడు నీటి తొట్టెలో వేసాడు. ఈ సందర్భంగా అక్కడ గందరగోళ పరిస్థితి నెలకొంది.. పోలింగ్ నిలిచిపోవడంతో జిల్లా కేంద్రంలోని అధికారులతో సహా మండల స్థాయి అధికారులు పరుగులు పెట్టారు స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని జరిగిన ఘటనను అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రాంతంలో పోలింగ్ తిరిగి ప్రారంభించేందుకు అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారు