YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

కరోనా సెకండ్‌ వేవ్‌ లో ఇన్ఫెక్షన్లు... కొత్తగా గులాబీ కళ్ళు, గ్యాస్ట్రోనమికల్ పరిస్థితులు, వినికిడి లోపం

కరోనా సెకండ్‌ వేవ్‌ లో ఇన్ఫెక్షన్లు... కొత్తగా గులాబీ కళ్ళు, గ్యాస్ట్రోనమికల్ పరిస్థితులు, వినికిడి లోపం

న్యూఢిల్లీ ఏప్రిల్ 8
కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి ప్రపంచం వ్యాప్తంగా మరింత పెరుగుతున్నది. కొంతకాలం ఉపశమనం ఇచ్చిన తరువాత తాజాగా కొత్త మూడు లక్షలణాలతో కరోనా సెకండ్‌ వేవ్‌ భారతదేశాన్ని తాకింది. సెకండ్‌ వేవ్‌లో ఇన్ఫెక్షన్లు, కేసులు పెరుగుతున్నాయి.సెకండ్‌ వేవ్‌ను తేలికగా తీసుకోవద్దని ప్రభుత్వం సూచిస్తున్నది. ఈ వ్యాధిని నియంత్రించడానికి దేశానికి వచ్చే నాలుగు వారాలు క్లిష్టమైనవి అని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. కరోనావైరస్ సెకండ్‌ వేవ్ మొదటిదానికంటే తీవ్రంగా ఉన్నదని నిపుణులు ఆందోళన చెందుతున్నారు.వైరస్ సెకండ్‌ వేవ్ ఇన్ఫెక్షన్‌ లక్షణాలను అభివృద్ధి చేస్తున్న విధానంలో మార్పును నివేదిస్తున్నట్లు పరిశోధకులు చెప్తున్నారు. పరిశోధకులు జాబితాలో కొత్త లక్షణాలను చేర్చారు. ఇప్పటివరకు కొవిడ్‌-19 సాధారణ లక్షణాలు జ్వరం, శరీర నొప్పులు, వాసన, రుచిని కోల్పోవడం, చలిగా ఉండటం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలు కనిపించేవి.ప్రస్తుతం సెకండ్‌ వేవ్‌లో కరోనా వైరస్‌ వ్యాపించిన వారిలో కొత్తగా గులాబీ కళ్ళు, గ్యాస్ట్రోనమికల్ పరిస్థితులు, వినికిడి లోపం వంటి లక్షణాలను పరిశోధకులు గుర్తించారు. ఈ లక్షణాలను తేలికగా తీసుకోకూడదని వీరు సూచిస్తున్నారు.
పింక్ ఐస్(కళ్ళు):
చైనాలో నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం, పింక్ ఐస్‌ లేదా కండ్లకలక అనేది కొవిడ్‌-19 ఇన్ఫెక్షన్‌కు సంకేతం. పింక్‌ ఐస్‌ వచ్చినప్పుడు కంటిలో ఎరుపు, వాపు కనిపిస్తుంది. కన్ను అంతా నీరుగా మారుతుంది. కరోనావైరస్ కొత్త జాతి బారిన పడిన 12 మందిలో ఈ లక్షణాలను పరిశోధకులు గుర్తించారు.
వినికిడి నష్టం / బలహీనత
ఈ మధ్యకాలంలో రింగింగ్ ధ్వని లేదా ఒకరకమైన వినికిడి లోపాన్ని గమనించినట్లయితే.. అది కరోనా వైరస్‌ సోకినట్లు సంకేతం కావచ్చని భావించాలి. ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఆడియాలజీలో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం, కొవిడ్‌-19 ఇన్ఫెక్షన్‌ వినికిడి సమస్యలకు దారితీస్తుంది. కరోనా-వినికిడి, వెస్టిబ్యులర్ సమస్యల మధ్య అనుబంధాన్ని గుర్తించిన 56 అధ్యయనాలను పరిశోధకులు కనుగొన్నారు. వినికిడి లోపం యొక్క ప్రాబల్యం 7.6 శాతం అని అంచనా వేయడానికి వారు 24 అధ్యయనాల నుంచి డాటాను సేకరించారు.
గ్యాస్ట్రోఇంటెస్టైనల్‌ లక్షణాలు
కరోనా వైరస్‌ సోకిన వారిలో అనేక జీర్ణశయాంతర ఫిర్యాదులు కూడా వస్తున్నాయని పరిశోధకులు చెప్తున్నారు. కొవిడ్‌-19 ఎన్ఫెక్షన్‌ ఎగువ శ్వాసకోశ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. అయినప్పటికీ, ఒక కొత్త అధ్యయనం ప్రకారం.. అతిసారం, వాంతులు, ఉదరంలో తిమ్మిరి, వికారం, నొప్పి కరోనావైరస్ సంకేతాలు. మీరు ఏదైనా జీర్ణ అసౌకర్యాన్ని ఎదుర్కొంటుంటే.. అది కరోనా వైరస్‌ ఇన్ఫెక్షన్‌గా భావించాలని పరిశోధకులు సూచిస్తున్నారు. జీర్ణ అసౌకర్యాలను ఎవరికి వారే గుర్తించాల్సి ఉంటుంది

Related Posts