YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ

వేలాది ఎకరాల్లో మామిడి

 వేలాది ఎకరాల్లో మామిడి

అదిలాబాద్, ఏప్రిల్ 9, 
మంచిర్యాల జిల్లాలోని నెన్నెల, జైపూర్‌, చెన్నూర్‌, కోటప ల్లి, తాండూర్‌, మంచిర్యాల, భీమిని మండలాల్లో వేలాది ఎకరాల్లో మామిడి సాగవుతున్నది. జైపూర్‌, భీమారం, నెన్నెల, మందమర్రి మండలాల్లో మొత్తం 8 గ్రామ స్థాయి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. మామిడి తోటల నుంచే నేరుగా పంట ను సేకరిస్తారు. ఈ యేడాది జిల్లా నుంచి మొత్తం 100మెట్రిక్‌ టన్నుల సేకరణ లక్ష్యంగా పెట్టుకున్నా రు. గోదావరి మహిళా రైతు ఉత్పత్తిదారుల కంపెనీ ఆధ్వర్యంలో నాణ్యమైన మామిడికాయలను కొనుగోలు చేసి, వినియోగదారులకు అందించేందుకు ముందుకెళ్తున్నది. జిల్లాలో 146 రైతు ఉత్పత్తిదారుల సంఘాలతో 2,200 మంది చిన్న, సన్నకారు రైతులతో రైతు ఉత్పత్తిదారుల కంపెనీ ఏర్పాటు చేసింది. తోటలోనే గ్రేడింగ్‌ చేసి (ఏ,బీ) పేరిట కొనుగోలు చేస్తారు. దీంతో నాణ్యమైన మామిడికాయలతో పాటు రైతుకు గిట్టుబాటు ధర వస్తుంది. ఇప్పటికే కొనుగోలు విషయంలో రైతులకు, కూలీలకు అనేక అవగాహన సదస్సులు నిర్వహించారు.రాష్ట్రస్థాయి ఫెడరేషన్‌ బెనిషాన్‌ ఫార్మర్‌ ప్రొడ్యూసర్‌ కంపెనీ ద్వారా సెర్ప్‌ మామిడి కొనుగోళ్లు చేపట్టనున్నది. ఇక్కడ కొనుగోలు చేసిన మామిడిని స్టేట్‌ ఫెడరేషన్‌ ‘బెనిషాన్‌’ ద్వారా రాష్ట్రంలోనిడీ-మార్ట్‌, హెరిటేజ్‌, తదితర రకాల హోల్‌సేల్‌ ప్రధాన సూపర్‌ మా ర్కెట్లకు పంపించనున్నారు. ఢిల్లీ, సహా ఇతర రాష్ర్టాలకూ ఎగుమతి చేయనున్నారు. కాగా, కొన్నిచోట్ల ఇప్పటికే మొదటి విడుత సేకరణ ప్రారంభమైంది.జిల్లా మామిడి రైతులకు మార్కెటింగ్‌ సౌకర్యం కల్పించడం కోసం మహిళా రైతు ఉత్పత్తి సంఘం భరోసా ఇస్తున్నది. గ్రామాల్లోనే కొనుగోలుకు విలేజ్‌ లెవల్‌ ప్రొక్యూర్మెంట్‌ సెంటర్లను (వీఎల్‌పీసీ) ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో మామిడి రైతుల కష్టాలు తీరనున్నాయి. స్థానికంగా మామిడి కొనుగోలు చేయడంలో రైతులకు గిట్టుబాటు ధరతో పాటు వినియోగదారులకు నాణ్యమైన పండ్లు అందించాలనే ప్రభుత్వ ఆలోచన ఆచరణలోకి రానుంది. ఇప్పటికే గోదావరి మహిళా రైతుల ఉత్పత్తిదారుల సంఘం ద్వారా మామిడి కొనుగోలుకు ప్రణాళికలు చేశారు. మరో 15 రోజుల్లో మామిడికాయలను కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్నారు.ఆహార ఉత్పత్తి కేంద్రాలు (ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూని ట్‌) ఏర్పాటు చేయాలనే రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణలో మన జిల్లాలో మామిడిని ఎంపిక చేసింది. మామిడి రైతుల నుంచి నాణ్యమైన కాయలను కొనుగోలు చేసి నేరుగా షాపింగ్‌ మాల్స్‌కు పంపించనున్నారు. మంచిర్యాల జిల్లాలో మామిడి దిగుబడి అధికంగా రానుంది. జిల్లాలో 14 వేల హెక్టార్ల తోటలు విస్తరించి ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా దాదాపు 70 రకాల మామిడి పండ్లు సాగవుతున్నాయి. వీటిలో ఎక్కువగా బంగినపల్లి, రసాలు, దసేరి, తదితర రకాలు లభించనున్నాయి. లంగ్డా, పెద్దరసం, తోతాపరి, సుందరి, పంచదార, హిమాయత్‌, పొనాస, నీలం, కొత్తపల్లి, కొబ్బరి లాంటివి అధికంగా ఉన్నాయి. మన జిల్లాలో సాగవుతున్న మామిడి పంటలకు దేశవిదేశాల్లో మంచి డిమాండ్‌ ఉంది. దీంతో వీటిని సాధారణంగా నాగ్‌పూర్‌ మార్కెట్‌ ద్వారా విదేశాలకు ఎగుమతి చేస్తారు.మార్కెట్‌ ధర ప్రకారం కొనుగోలు చేసిన వెంటనే న గదు చెల్లిస్తారు. తోటలోనే కాయను గ్రేడింగ్‌ చేసి (ఏ,బీ) తీసుకుంటారు. అధికారుల సూచనలు రైతు లు పాటిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. గిట్టుబాటు ధరతో పాటే అధిక లాభాలు గడించే అవకాశం ఉం టుంది. మామిడికాయలను కొనుగోలు చేసిన సంస్థ కు వచ్చిన లాభాలను తిరిగి రైతులకు బోనస్‌ రూ పంలో పంచనున్నది. ఏ రైతు నుంచి కొనుగోలు చే స్తే ఆ రైతులకు బోనస్‌ ఇస్తారు. ముఖ్యంగా సంబంధిత రైతు ఆ సంస్థలో సభ్యుడిగా ఉండడంతో లాభాలను తీసుకోవచ్చు. మొత్తం146 రైతు ఉత్పత్తిదారు ల సంఘాలతో గోదావరి మహిళా రైతు ఉత్పత్తిదారుల సంస్థ ఏర్పడింది. ఈ సంస్థలో2,200 మం ది రైతులు సభ్యత్వం తీసుకున్నారు. కాగా, నేరుగా మామిడిని స్థానికంగా కొనుగోలు చేయడంతో రైతులకు రవాణా ఖర్చులు తగ్గుతాయి. దళారీ వ్యవస్థ దూరమవుతుంది. దీంతో ధర అధికంగా వస్తుంది.

Related Posts