YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

సిద్ధిపేటలో బస్ స్టేషన్ పునర్నిర్మాణ పనులకు మంత్రి హరీశ్ రావు శంకుస్థాపన

సిద్ధిపేటలో బస్ స్టేషన్ పునర్నిర్మాణ పనులకు మంత్రి హరీశ్ రావు శంకుస్థాపన

సిద్ధిపేట ఏప్రిల్ 9
పెరిగిన రద్దీ, అవసరాల దృష్ట్యా సిద్దిపేట‌లో నూతన మోడల్ బస్టాండ్ నిర్మించబోతున్నట్లు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేటలో రూ.6 కోట్ల రూపాయల వ్యయంతో బస్ స్టేషన్ పునర్నిర్మాణ పనులకు, అనంతరం ఎక్స్ ప్రెస్ బస్టాండు రోడ్డు పునరుద్ధరణ- రోడ్డు విస్తరణ పనులకు శుక్రవారం ఉదయం జిల్లా జెడ్పీ చైర్మన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ, ఎమ్మెల్సీ రఘోత్తం రెడ్డిలతో కలిసి మంత్రి శ్రీ హరీశ్ రావు శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. 45 సంవత్సరాల క్రితం అప్పటి రవాణా శాఖ మంత్రి చొక్కరావు పాత బస్ స్టేషన్ ను ప్రారంభించారని గుర్తు చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ సిద్దిపేట జనాభా 10 రెట్లు పెరిగిందన్నారు. పెరిగిన జ‌నాభాకు త‌గ్గ‌ట్టు బ‌స్టాండ్‌లో సౌక‌ర్యాలు లేవు అని తెలిపారు. ప్రతిరోజూ సుమారు 22 నుంచి 25 వేల మంది ప్రయాణీకులు, పరిసర ప్రాంతాలలో ప్రజలు ఈ బస్ స్టేషన్ కు వచ్చి వెళ్తున్నారని తెలిపారు. ఈ క్ర‌మంలో పెరిగిన రద్దీని దృష్టిలో పెట్టుకుని రూ.6 కోట్లతో నూతన బస్ స్టేషన్‌కు ఇవాళ శంకుస్థాప‌న చేశామ‌ని పేర్కొన్నారు. నూత‌న బ‌స్టాండ్‌లో అన్నీ రకాల అధునాతన సౌకర్యాలు కల్పిస్తూ., మూడు అంతస్తులతో నిర్మాణం చేపడుతామ‌న్నారు. దాదాపు 15 వేల పైచిలుకు విద్యార్థులు, మహిళలకు, వృద్ధులకు, వికలాంగులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తామని, ఎలాంటి అసౌకర్యం కలగకుండా రూపకల్పన చేసినట్లు మంత్రి చెప్పారు.గతంలో సీఎం కేసీఆర్ సిద్ధిపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పట్టణంలో ఎక్స్ ప్రెస్ బస్టాండ్ నిర్మించారని గుర్తు చేశారు. అప్ప‌ట్నుంచి ఇప్పటివరకు దాదాపు దశాబ్దాలుగా పట్టణ రద్దీ పెరిగింది. దీంతో ఎక్స్ ప్రెస్ బస్టాండ్ వెనుక ఉన్న కాలనీలకు ట్రాఫిక్ పెరిగిన దృష్ట్యా రూ.12 లక్షల రూపాయలతో రోడ్డు విస్తరణ-వైడింగ్ పనులు చేప‌డుతున్నామ‌ని తెలిపారు. ప్రజాప్రయోజనార్థం ఎక్స్ ప్రెస్ బస్టాండు హరిప్రియ నగర్, శ్రీనగర్ కాలనీ, ఆర్డీఓ క్యాంపు కార్యాలయం, తహశీల్దార్ కార్యాలయం వచ్చిపోయే దారిలో ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారం దిశగా ఆర్టీసీ నుంచి తీసుకున్న భూ సేకరణకై రూ. 84 లక్షలు రూపాయలు చెల్లింపులు చెల్లించామ‌ని చెప్పారు. త్వరలోనే టెండర్ ప్రక్రియ పూర్తి చేసి నిర్మాణాలు చేపడుతామని మంత్రి చెప్పారు.తన బస్టాండు నిర్మిస్తున్న దృష్ట్యా ప్రజలకు ఉపయోగపడేలా, ప్రయాణీకులకు ఇబ్బందులు లేకుండా తాత్కాలికంగా ఒక పార్ట్ బస్ స్టాప్ ఏర్పాటు చేయాలని ఆర్టీసీ అధికారులను మంత్రి ఆదేశించారు. ప్రజా రవాణా వ్యవస్థ, సీఎస్ఆర్ నిధులు-దాతల సహకారంతో బస్టాండు, ఎక్స్ ప్రెస్ బస్టాండు త్వరితగతిన పూర్తి చేయాలని ఆర్టీసీ అధికారులను సూచించారు. నలుదిక్కులా పట్టణం పెరుగుతున్న దృష్ట్యా రాబోయే రోజుల్లో పట్టణంలో సిటీ బస్సులు ప్రవేశ పెట్టాలని ఆర్టీసీ అధికారులను మంత్రి ఆదేశించారు.

Related Posts