విశాఖఫట్నం
స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా విశాఖ జీవీఎంసీ కౌన్సిల్లో మేయర్ హరి వెంకట కుమారి తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకం గా జీవీఎంసీ కౌన్సిల్ ఏకగ్రీవ తీర్మానం చేసింది. దీనిపై జీవీఎంసీ కౌన్సిల్లో చర్చ జరిగింది. ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీక రణకు వైఎస్సార్సీపీ వ్యతిరేకమ న్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీక రణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేస్తామని సీఎం వైఎస్ జగన్ చెప్పారని ఆయన తెలిపారు. టీడీపీ మాదిరిగా ద్వంద్వ విధానం కాదన్నా రు. ఢిల్లీలో హోదా వద్దన్న చరిత్ర టీడీపీదని ఆయన మండి పడ్డారు. ప్రసంగానికి టీడీపీ సభ్యులు అడ్డుపడటంతో.. చంద్రబాబు పేరు ఎత్తగానే ఎందుకు ఉలిక్కిపడుతు న్నారంటూ గుడివాడ అమర్నాథ్ ప్రశ్నించారు.ఎమ్మెల్యే వాక్యాలపై టీడీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో గందరగోళం ఏర్పడింది.